ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తిక భేటీ చోటుచేసుకుంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఏపీ సీఎం జగన్ బావ మరిది, షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారు. రాజమండ్రిలో ఉండవలి నివాసంలో దాదాపు రెండు గంటలపాటు బద్రర్ అనిల్ భేటీ అయ్యారు. వాస్తవానికి బ్రదర్ అనిల్ కుమార్ కు రాజకీయ పరంగా ఎటువంటి సంబంధాలు లేకపోయినా..ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉండవల్లితో భేటీ అయిన సందర్బంగా బ్రదర్ అనిల్ మాట్లాడుతూ..అరుణ్ కుమార్‌ని మర్యాద పూర్వకం గానే కలిశానని తెలిపారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఉండవల్లి అరుణ్ కుమార్. కుటుంబ పరంగాను..రాజకీయ పరంగాను చక్కటి సలహాలు ఇచ్చే శ్రేయోభిలాషి అని తెలిపారు. ఆయన తో మాట్లాడుతుండా..ఏపీ,తెలంగాణ రాజకీయాల గురించి పలు అంశాలు చర్చకు వచ్చాయని..పార్టీ పరంగాను..కుటుంబ పరంగాను ఉండవలి మంచి సలహాలు ఇచ్చారని బ్రదర్అనిల్ కుమార్ తెలిపారు.
ఈ భేటీ అనంతరం ఉండవలి బ్రదర్ అనిల్ కుమార్ కు ఏపీ విభజన కథ పుస్తకాన్ని ఇచ్చారు. కాగా..వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. దీంతో రాజకీయాలపై చర్చించేందుకు ఉండవల్లితో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారని..ఇంకా పలు కీలక అంశాలు గురించి వారు చర్చించి నట్లుగా సమాచారం. ముఖ్యంగా ఇప్పుడు షర్మిల పుంజుకునేందుకు పెద్దగా అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు.. ఎవరూ కూడా.. పార్టీలో చేరడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీని ఎలా ముందుకు నడిపించాలనే విషయం.. షర్మిలకు దిశానిర్దేశం చేసే పెద్ద తలకాయ కూడా ఎవరూ కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలోనే రాజకీయ మేధావి.. విశ్లేషకులు, పైగా.. వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత కీలక సన్నిహి తుడిగా గుర్తింపు పొందిన ఉండవల్లి అరుణ్‌కుమార్ ను షర్మిల.. నేరుగా కలవకుండా.. తన భర్తను పంపిం చారనే చర్చ సాగుతోంది. ఇక, దీనికి ఉండవల్లి.. చెప్పిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తమ మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చాయని అరుణ్ చెప్పారు. అంతేకాదు.. తాను కొన్ని విషయాలు వద్దని కూడా చెప్పానన్నారు. మరికొన్ని విషయాల్లో సలహాలు కూడా ఇచ్చానన్నారు. ఏదేమైనా.. ఇప్పటకిప్పుడు అన్నివిషయాలూ చెప్పలేనని అన్నారు. అంటే.. దీనిని బట్టి.. అత్యంత కీలకమైన రాజకీయ విషయాలే.. వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.