వంశీకృష్ణ యాదవ్ అనే ఓ ఎమ్మెల్సీ విశాఖ కేంద్రంగా రాజకీయాలు నిర్వహించే వ్యక్తి నిన్నమొన్నటి వేళ ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఆ వీడియో ఆధారంగా రాస్తున్న కథనం ఇది.
వంశీ చుట్టూ రౌడీలు ఉన్నారు. రౌడీషీట్లు ఉన్నవారే ఆయన చుట్టూ ఉన్నారు.. దీనిపై అభిప్రాయం ఏంటి? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూఎప్పుడో నమోదయిన రౌడీ షీట్లు అవి, ఇప్పుడంతా వాళ్లంతా మారిపోయారు..కనుక ఆ అభియోగం కానీ అభిప్రాయం కానీ తప్పు అని చెప్పి తప్పుకున్నారు.
ఆధారాలతో సహా చాలా మంది రౌడీ షీటర్లు తన చుట్టూ ఉన్నారన్న వాదనను మరో సారి యాంకర్ వినిపిస్తే అబ్బే! అదేం లేదు మీరు కాంట్రవర్సీలు క్రియేట్ చేయకండి అని కూడా అన్నారు. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవద్దు అని కూడా ప్రాథేయపడ్డారు.
ఇక సాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న వంశీ చుట్టూ ఇంకొంత రాజకీయం కూడా ఉంది.విశాఖలో భూకబ్జాలలో సాయిరెడ్డి ప్రమేయం ఉందన్న వార్త కూడా వస్తోంది..వీటిపై మీరు ఏమంటారు దేవుడిపై ప్రమాణం చేశాను కనుక అవన్నీఅబద్ధాలు అని చెబుతాను అని చెప్పారాయన. ఇంకా ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు.
అస్సలు తమ పార్టీ పెద్దలెవ్వరికీ భూకబ్జాలలో వాటాలు లేవనే తేల్చేసి ఆశ్చర్యపరిచారాయన. వాస్తవా
ముఖ్యంగా రిషి కొండ చుట్టూ మట్టి తవ్వకాలు సాగిపోతున్నాకూడా ఆపే నాథుడే కాదు అడిగే నాథుడు కూడా లేడు. ఇది కూడా వాస్తవమే కానీ ఇవేవీ అంగీకరించే స్థితిలో ఇవాళ అధికారపార్టీ సభ్యులు లేరన్నది ఓ వాస్తవం. పవన్ కూడా గతంలో ఇవే విషయాలు ప్రస్తావించి వైసీపీ ఆగ్రహానికి గురయ్యారు.
తాజాగా విశాఖ లో ల్యాండ్ మాఫియాను అడ్డుకునే ప్రయత్నాలుఎవ్వరూ చేయకపోగా, అధికార పార్టీ తరఫున వంశీ లాంటి వ్యక్తులే ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా డమ్మీ అయిపోతున్నారని, సాయిరెడ్డిదే అంతా హవా అని స్పష్టమయిన ఆధారాలు కూడా ఉన్నా ఇవాళ వాటిని నియంత్రించే నాథుడే లేడని జనసేన గగ్గోలు పెడుతోంది.
ముఖ్యంగా విశాఖలో ల్యాండ్ మాఫియా పై జగన్ కూడాసీరియస్ అయ్యారు. మైనింగ్ కూడా హాయిగా సాగిపోతోంది. మన్యం కేంద్రంగా గంజాయి రవాణా అయిపోతోంది.ఇవేవీ పట్టింపులోలేకుండా అధికార పార్టీ సభ్యులు దేవుడి మీద ప్రమాణం చేసి మరీ అబద్ధాలు చెప్పడం అంటే ఆశ్చర్యమే మరి!