ఆ పార్టీ ఎమ్మెల్యేలు అనుకున్నారా.. కాదు, కాదు.
దేశంలో వెలగాలనుకున్న కొత్త నాయకులు.
వారు జగన్ ను వదిలేశారు.
కేసుల కారణంగా మోడీని ఎదిరించలేని జగన్ ను తమతో కలుపుకుంటే కూటమి బలహీన పడుతుందని వారు జగన్ ను వదిలేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ సిఎం కె. చంద్రశేఖర్ రావులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరియు కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఈ విషయమై మమతా బెనర్జీ ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రాంతీయ పార్టీల సీఎంల సమ్మేళనం నిర్వహించాలని మమత భావిస్తున్నారు.
కేసీఆర్, స్టాలిన్‌లతో మాట్లాడినట్లు మమతా బెనర్జీ సోమవారం తనే స్వయంగా ప్రకటించారు. ప్రాంతీయ పార్టీల సీఎంల సమ్మేళనం నిర్వహించేందుకు మమత చూపుస్తున్న చొరవకు డీఎంకే మద్దతు ఇస్తుందని స్టాలిన్ ధృవీకరించారు.
జాతీయ సమ్మేళనంపై చర్చించేందుకు కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం కానున్నారు.
అయితే వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం మమతా బెనర్జీ, కేసీఆర్‌లు వదిలేశారు.
ఆది, సోమవారాల్లో మమత, కేసీఆర్ జగన్‌ను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించారని, అయితే ఆయన అందుబాటులోకి రాలేదని సమాచారం.
మమత, కేసీఆర్‌తో చేతులు కలపడం జగన్‌కు ఇష్టం లేదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీని ఎదుర్కోవడం కూడా జగన్ కు ఇష్టం లేదని వారికి అర్థమైంది.
దీంతో వారు జగన్ ను వదిలేశారు.