ఏపీలో పరిపాలనపై లోకేష్ నారా నిప్పులు చెరిగారు. ప్రజలకు, గుడులకు కూడా జగన్ రాజ్యంలో రక్షణ లేదని విరుచుకుపడ్డారు. కొంతకాలంగా తన విమర్శల్లో గాడత పెంచిన జగన్… ప్రస్తుతం తీవ్ర పదజాలం వాడేస్తున్నారు.
విజయసాయిరెడ్డిని ఏకంగా దొంగ అని సంబోదించిన లోకేష్ తాజాగా దేవాదాయ శాఖ మంత్రిని కంత్రీ అంటూ తిట్టారు. 120కి పైగా ఆలయాలపై దాడులు జరిగినా బాధ్యత వహించడం లేదంటూ తిట్టిపోశారు. లోకేష్ లో ఫైర్ ను ఆయన మాటల్లోనే చదువుకుందాం.
గాడిదకేం తెలుస్తుంది గంథం వాసన! @Ashok_Gajapathi వంశీకులు కట్టించిన ఆలయాల ముందు కొబ్బరిచిప్పలు కొట్టేసే దొంగకి మహారాజు ఔన్నత్యం ఎలా తెలుస్తుంది? నీతికి, బూతుకు తేడా తెలియనివాడి నోటి నుంచి అంతకంటే మంచి భాష ఎలా వస్తుంది?రామతీర్థం ఆలయం కట్టించిన అశోక్‌గజపతిరాజు పూర్వీకులు..ఆలయ ధూపదీపనైవేద్యాలకు తమ ఏలుబడిలోని 12 గ్రామాలను కేటాయించారు. విజయనగరం సంస్థానంలో 105 దేవాలయాల నిర్మాణం, పోషణా పూసపాటి వంశీకులదే అని అయినా తెలుసా దేవాదాయశాఖా మంత్రీ! మాన్సాస్ ట్రస్టు ద్వారా 14కి పైగా విద్యాసంస్థలకు మహారాజ పోషకులు పూసపాటి వంశీకులే కంత్రీ మంత్రీ! తెలుసుకో.