బీజేపి విష్ణు వైసీపీ వేషాలు
ఏపీలో బీజేపీ తను ఎదగాలనుకుంటుందో.. జగన్ ఎదగాలనుకుంటుందో అర్థం కాని పరిస్థితి. ఏపీ బీజేపీ నాయకులు మాట్లాడే ప్రతి మాట ఏపీలో బీజేపీకి కట్టే సమాధికి ఒక్కో రాయి పేర్చుతున్నట్టు అనిపిస్తుంది.
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 127 దేవాలయాలపై దాడులు జరిగితే... ఇంతవరకు నిందితులను పట్టుకోకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీసి ఏపీలో ధర్నాలకు దిగాల్సిన బీజేపీ నేతలు... చంద్రబాబు హయాంలో గుళ్లు కూలగొట్టారంటూ గోల మొదలుపెట్టారు.
ఈ గోలకు ఎపుడూ విష్ణువర్దన్ రెడ్డి నాయకత్వం వహిస్తుంటారు. అపుడపుడు వీర్రాజు, జీవీఎల్ కూడా నాయకత్వం వహిస్తుంటారు. జగన్ ను ముఖ్యమంత్రి సీట్లో పదిలంగా కూర్చోబెట్టాలనుకోవడం వీరి ప్రధాన వృత్తి. మరి వెనుక ఏం సెటిల్మెంట్లు జరుగుతున్నాయో ఆ దేవుడికే ఎరుక.
ఇదిలా ఉంటే తాజాగా రామతీర్థం లో నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు అక్కడ పర్యటించారు. దానికోసం పట్టుబట్టాల్సిన బీజేపీ విజయవాడలో చంద్రబాబు గతంలో దేవాలయాలు కూల్చాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే... అవన్నీ దుర్గగుడి ప్లైఓవర్ కోసం మరోచోటకు తరలించిన దేవాలయాలు. ఆ ఫ్లైఓవర్ ను తమ ఖాతాలో వేసుకున్న బీజేపీ దానికోసం తరలించిన గుళ్లను మాత్రం చంద్రబాబు ఖాతాలో వేస్తుంది. దీనిపై విష్ణురెడ్డి నాలుక మడతేయగా... జర్నలిస్టు మూర్తి తీవ్రంగా తప్పుపడుతూ చేసిన వ్యాఖ్యానం ఇదిగో కింద చూడండి.
దుర్గగుడి ఫ్లైఓవర్ మా బీజేపీ గొప్పతనం అంటున్నారు, కానీ ఆ ఫ్లైఓవర్ కోసం అడ్డుగా ఉన్న గుడిలు తొలగిస్తే మాత్రం, అది తెలుగుదేశం మీద సిగ్గు లేకుండా తోసేస్తున్న BJP ని వాయించిన మూర్తి గారు.
— Bhavya🦩 (@unexpected5678) January 2, 2021
pic.twitter.com/HH1dft9zlS