సర్ ప్లస్ స్టేట్ తెలంగాణతో సమానంగా… లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2015లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. 43 శాతం అనేది చరిత్రలోనే అత్యధిక ఫిట్ మెంట్. అయినా కూడా ఆరోజు చంద్రబాబుకు ఉద్యోగులు మద్దతుగా నిలబడలేదు. ఆ విషయం పక్కన పెడితే…
ఉద్యోగులకు పెద్ద పెద్ద హామీలిచ్చిన జగన్ తాను అధికారంలోకి రాగానే ఉద్యోగులను మోసం చేశారు. చరిత్రలో ఇలా ఎన్నడూ ఎవరూ చేయని మోసం ఇది. భారత దేశ చరిత్రలోని ఏ రాష్ట్రంలోను జరగని మోసం ఏపీ ఉద్యోగులకు జరిగింది.
ఉద్యోగుల శాలరీలు పెంచడానికి వేసిన పీఆర్సీని తగ్గించడానికి వాడి ఉద్యోగులకు షాక్ ఇచ్చాడు. పైగా చంద్రబాబు ప్రభుత్వంలో పెంచిన హెచ్ఆర్ఏని కూడా జగన్ అడ్డంగా కోసిపడేశాడు. చివరకు వారు ధర్నాకు దిగితే… సంఘాలను చీల్చి… నాయకులను లోపల ఏం చేశారో గాని వారు అన్నిటికి ఒప్పుకునే చేశారు. ఏ లంచమూ రూపాయి తినని టీచర్లు మాత్రం పోరాటం ఆపకుండా నిరసన తెలుపుతున్నారు.
అయితే, వారిని ఎలా ఆపాలో తెలియని ఏపీ సీఎం జగన్ … పరోక్షంగా రౌడీషీట్లు పెట్టి, కేసులు పెట్టి వేధిస్తున్నారు అని చంద్రబాబు ఆరోపించారు. నువ్వేమైనా నియంతనా? ఎవరూ నీకు ఎదురు మాట్లాడకూడదా? ఎవ్వరూ నిన్ను ప్రశ్నించకూడదా? నువ్వేమైనా టెర్రరిస్టా అంటూ చంద్రబాబు జగన్ పై నిప్పులు చెరిగారు.
ఈ 5 నిమిషాల వీడియోలో చంద్రబాబు ఉద్యోగులను జగన్ ఎలా మోసం చేశాడో చూపించి వివరించాడు. మీరే చూడండి.