కోర్టు తీర్పులు జగన్ కు అనుకూలంగా రావడం లేదన్న అక్కసుతో వైసీపీ కార్యకర్తలు అప్పట్లో న్యాయ వ్యవస్థ మీద చేసిన దాడిని గమనించాం. తప్పుడు నిర్ణయాలు తీసుకుని వాటిని కోర్టులు ఆమోదించాలని కోరుకోవడం తప్పు. ఆ తప్పును తప్పు పట్టినందుకు న్యాయమూర్తులును వైసీపీ నేతలు, కార్యకర్తలు బూతులతో తిట్టారు.
ఇది ఉద్యమంలా సాగడంతో హైకోర్టు దీనిని సీరియస్ గా పరిణగణించింది. కేసును సీబీఐకి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ పలువురు వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేసింది. తర్వాత వారికి బెయిలు కూడా రాలేదు. సుదీర్ఘకాలం జైలులో ఉన్నాక వారికి ఇటీవలే బెయిలు వచ్చింది.
ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ… ట్విట్టరు, fb లను కోర్టులో ప్రవేశపెట్టింది. వారు ఈ కామెంట్లపై తప్పును అంగీకరిస్తూ అన్నీ తొలగిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు సీబీఐ దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తోందని వార్తలు వచ్చాయి.
అయితే, సాయంత్రం నుంచి ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే…
వైసీపీ సోషల్‌మీడియా విభాగం డిజిటల్ కార్పొరేషన్ కేంద్రంగా న్యాయవ్యవస్థపై విద్వేష విష ప్రచారం చేసిందని సీబీఐ బృందం తేల్చిందట. డిజిటల్ కార్పొరేషన్ ఆఫీసు నుంచి ఐదుగురిని అదుపులోకి తీసుకుందట సీబీఐ. వీటికి నాయకత్వం వహించిన డిజిటల్ కార్పొరేషన్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి పరారీలో ఉన్నారట. డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ ఐడ్రీమ్ వాసుదేవరెడ్డి కూడా పరారీలో ఉన్నారట. వైసీపీ పేటీఎం, ఐడ్రీమ్ సోషల్‌మీడియా అక్కౌంట్లు ఒక్కొక్కటీ డియాక్టివ్ అవుతున్నాయట. ప్రజాధనంతో ప్రభుత్వ పదవుల్లో ఉంటూ …జడ్జిలు, న్యాయవ్యవస్థపై సోషల్‌మీడియా ద్వారా విషప్రచారాన్ని చేసినట్టు సీబీఐకి తెలిసిందట. తొలి విడత అరెస్టయిన వారిలో అప్రూవర్లుగా మారిన లింగారెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అజయ్ అమృత్, అవుతు శ్రీధర్‌రెడ్డి ద్వారా ఈ సమాచారం సేకరించి సీబీఐ దర్యాప్తు చేసిందట.
ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాట నిజమే కానీ ఎంతవరకు వాస్తవమో తెలియడం లేదు. రేపటికి ఇందులోని నిజానిజాలు బయటకు వస్తాయోమో. వేచి చూడాలి.