ఆంధ్రప్రదేశ్ విభజన లోపభూయిష్టంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో చేసిన ప్రకటనలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తెలంగాణ ప్రజలను మోదీ అవమానించారని తెలంగాణలోని కాంగ్రెస్, టీఆర్ ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలపాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.
వ్యవసాయ చట్టానికి సంబంధించిన బిల్లుకు పార్లమెంట్లో భారీ మెజారిటీతో ఎలా ఆమోదం లభించిందని మోదీ, బీజేపీ నేతలను ప్రశ్నించారు. తెలంగాణ సమాజంపై మోడీ చేస్తున్న కించపరిచే ప్రకటనలను బీజేపీ నేతలు ఎలా సమర్థిస్తారని హరీశ్ ప్రశ్నించారు.
దేశంలోని ఇతర ప్రాంతాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. కేంద్రం సహాయం చేయకపోయినా. అభివృద్ధి కార్యక్రమాల అమలులో తెలంగాణ ముందుంది అన్నారు.
తెలంగాణ, ఆంధ్రలను కలిపి మళ్లీ ఉమ్మడి ఆంధ్రను ఏర్పాటుచేస్తారన్న హరీష్ వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి.