రాష్ట్రం నిరసనలతో అట్టుడికిపోతోంది.
కాకినాడ లో ఆశా వర్కర్లు
రాజమండ్రి లో విద్యుత్ ఉద్యోగులు
సీతానగరం లో యూరియా కోసం రైతులు
రాష్ట్రవ్యాప్తంగా టీచర్లు, కాంట్రాక్టు వర్కర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు
3 ఆందోళనలు…. 6 ధర్నాలు… ఇదీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి.
ఇక సమస్యల పరిష్కారం ద్వారా కాకుండా లాలూచీ లొంగదీయడం అనే విధానాల ద్వారా ఉద్యమాలను అణచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మార్గంలో ఉద్యమాలను అడ్డుకోవడం ఎన్నటికీ ప్రభుత్వానికి సాధ్యం కాదు.
అధికారంలోకి రాక ముందు అన్నీ అలవికాని హామీలిచ్చి అధికారం చేపట్టాక జనాల్ని విభజించి పాలించు అనే బ్రిటిష్ సూత్రంతో ముందుకు వెళ్తున్న ఏపీ సర్కారుపై టీచర్లు తిరగబడ్డారు.
బ్రెయిన్ వాష్ చేస్తే లంచాలకు అలవాటు పడిన కొందరు ఉద్యోగులు ప్రభుత్వానికి జైకొట్టొచ్చేమో గాని మెజారిటీ ఉద్యోగులు ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు.
తాజాగా టీచర్లు కొత్త ఉద్యమానికి నాయకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. మరి వీరి పోరు ఎంత దాకా సాగుతుందో చూడాలి.
ఇక తాజా ప్రెస్ మీట్లో నలుగురు ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వంతో చేసుకున్న చీకటి ఒప్పందాల గురించి టీచర్ల సంఘ నేతలు చీల్చిచెండాడారు. అదేంటో ఈ వీడియోలో చూడండి.
https://www.youtube.com/watch?v=ikPj_bF86uk&ab_channel=ABNTelugu