ఈ రోజుల్లోని చాలామంది యువత పెళ్లంటే భయపడుతున్నారు. ఈ బంధాలు..పిల్లలు ..చికాకులు వద్దనుకుంటున్నారు. భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ…భర్తగా మారకు బ్యాచ్ లరూ….షాదీ మాటే వద్దు గురూ…. సోలో బ్రతుకే సో బెటరూ అంటూ పాటలు పాడుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇక, మరికొందరైతే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లను కొన్నాళ్లు మెయింటెన్ చేసి ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. ఇక, పెళ్లైన చాలామంది ఒక్క భార్యతోనే వేగేలేక చస్తున్నామంటూ సాటి మ(మూ)గోళ్ల దగ్గర వాపోతుంటారు. దీంతో, ఈ రోజుల్లో విడాకులు, బ్రేకప్ లు చాలావరకు సర్వ సాధారణమయ్యాయి.
ఇటువంటి జమానాలోనూ థాయ్ ల్యాండ్ కు చెందిన ఓ వ్యక్తి భార్యాబాధితులందికీ షాకిచ్చే పనిచేశాడు. ఒకటి కాదు రెండు కాదు…ఏకంగా 8 పెళ్లిళ్లు చేసుకొని అందిరతోనూ జాలీగా ఉంటున్నారు. ఇక, వీరందరినీ ఒకే ఇంట్లో ఉంచి కాపురం చేయడం ఈ స్టోరీకే హైలైట్. దీంతో, సోషల్ మీడియాలో ఈ 8 మంది పెళ్లాల ముద్దుల మొగుడి స్టోరీ వైరల్ అయింది.
థాయిలాండ్ కు చెందిన టాటూ ఆర్టిస్ట్ ఓంగ్ డామ్ సోరోట్ లో దివంగత మహా నటుడు రావు గోపాలరావు చెప్పినట్లు కళా పోషణ కూసింత ఎక్కువే ఉంది. అందుకే, ఈ నవ మన్మథుడు….ఏకంగా 8 ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నాడు. విచిత్రం ఏమిటంటే…అంతకుముందు పెళ్లి చేసుకున్న భార్యలను ఒప్పించిమరీ మిగతా పెళ్లిళ్లు చేసుకున్నాడు సోరోట్. ఇక, ఆ 8 మంది భార్యలనూ ఒకే ఇంట్లో పెట్టి కాపురం చేయడం ఏదైతే ఉందో…నభూతో నభవిష్యత్.
మామూలుగా అయితే, తన భర్తను వేరే అమ్మాయి చూస్తేనే తట్టుకోని భార్యలుంటారు. కానీ, సోరేట్ పెళ్లాలు మాత్రం తమలో తమకు సవతిపోరు లేదంటున్నారు. భార్యలందరిపై సోరోట్ ఎంతో ప్రేమ కనబరుస్తారడని వారు చెబుతున్నారు. సోరోట్ ఇంట్లో మొత్తం నాలుగు బెడ్ రూమ్స్ ఉండగా… ఒక్కో గదిలో ఇద్దరు భార్యల చొప్పున ఉంటున్నారట. ఇక, ఏ రోజు ఏ గదిలో, ఏ భార్యతో ఉండాలని వంతులు వేసుకుంటారట. ఈ కథనం చెందిన నెటిజన్లు కొందరు సోరోట్ పై అసూయపడుతుండగా…8 మంది పెళ్లాలతో ఎలా వేగుతున్నావ్ రా బాబూ అంటూ మరికొందరు జాలి చూపిస్తున్నారు. మనసుపడ్డ అమ్మాయినల్లా పెళ్లి చేసుకుంటున్న మనోడు…ఇంకెంతమందిని భార్యలుగా తెచ్చుకుంటాడో అని సెటైర్లు వేస్తున్నారు.