ఏపీలో జగన్ ని నిట్టు నిలువునా మాటలతో ర్యాగింగ్ చేస్తున్న వాడు ఎవడైనా ఉన్నాడంటే అది రఘురామరాజే.
రాష్ట్రంలో ఎవరికి ఏ వర్గానికి అన్యాయం జరిగినా… వారి తరఫున ఆధారాలతో జగన్ కి ప్రశ్నలు సంధిస్తూ వారి తరఫున వాయిస్ అవుతున్నాడు రఘురామరాజు.
తనదైన గోదారి సెటైరిక్ శైలితో జగన్ కి ఎక్కడ గుచ్చాలో అక్కడ గుచ్చుతున్నాడు.
తాజాగా ఉద్యోగుల విషయం ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై మాట్లాడుతూ రఘురామరాజు మూడే మూడు ప్రశ్నలు వేశాడు.
1 మీరు జీతం ఎక్కువిస్తున్నామంటున్నారు. మాకు ఎక్కువ వద్దు, తక్కువగా ఇచ్చే పాత జీతమే ఇవ్వండి మీకేం నొప్పి అంటున్నారు ఉద్యోగులు… మరి ఇవ్వచ్చుగా
2. చర్చలకు పిలుస్తున్నారు. జీవో రద్దు చేసే ప్రసక్తే లేదంటున్నారు. జీవో రద్దు చేసే ఉద్దేశం లేపుడు మరి చర్చలకు ఎందుకు పిలుస్తున్నారు?
3. అన్యాయం జరిగిన వాడు తనకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రిని కాలర్ పట్టుకుని నిలదీయగలిగిన రోజే మనకు మంచి రోజులు వచ్చినట్టు… అని మీరే ప్రతిపక్షంలో ఉన్నపుడు చెప్పారు. మీరు కాలర్ వద్దు కాళ్లు పట్టుకునే అవకాశం కూడా ఎందుకు ఇవ్వడం లేదు ?
ఇక ఉద్యోగుల సమస్య ప్రస్తావన మధ్యలో గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పిన రఘురామ రాజు అయ్యయ్యో మీరు వివేకానంద గొడ్డలి అనుకునేరు
నేను మాట్లాడింది ఆ గొడ్డలి గురించి కాదు, అంటూ సెటైర్ వేశారు.
ఆ వీడియో ఇదిగో.