ఈ ఏడాది ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని మహానాడు ను ధూంధాంగా నిర్వహించాలని.. పార్టీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా జిల్లాల పునర్విభజన నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ పేరుతో టీడీపీ తీసుకువచ్చిన 14 పథకాల పేర్లు తీసి వేసిన జగన్ ప్రభుత్వం… ఇప్పుడు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్లు, ముఖ్య నేతలతో ఆన్లైన్ సమావేశం నిర్వహించిన ఆయన.. వైసీపీ అక్రమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని శ్రేణులకు సూచించారు.
సమర్థ నేతలను పార్టీ వదులుకోదని.. పని చేయని వారిని ఉపేక్షించబోదని హెచ్చరించారు. క్యాసినో వ్యవహారంలో మంత్రి కొడాలి నాని తీరును ఎండగట్టడంలో.. పార్టీ నేతలు బాగా పని చేశారని కితాబిచ్చారు. విద్యుత్ చార్జీలు, పన్నులతో ప్రజలను పీక్కుతినేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారని చంద్రబాబు మండిపడ్డారు.
మార్చి నాటికి తెలుగుదేశం ఆవిర్భావం జరిగి 40 ఏళ్లు పూర్తవుతోందని ఈ సందర్భంగా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. మహానాడుతో పాటు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రానున్న రోజుల్లో పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ పేరుతో టీడీపీ తీసుకువచ్చిన 14 పథకాల పేర్లు తీసి వేసిన జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు జిల్లాకు పేరు పెట్టి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
వైసీపీ ఎమ్మెల్యేల, నేతల అక్రమాలపై గట్టిగా పోరాడాలని పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. వైసీసీ ఎమ్మెల్యేల అక్రమాలు, నియోజకవర్గ సమస్యలపై స్థానికంగా పోరాటాలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. జగన్ పాలనలో ప్రజలు పేదలయ్యారని, వైసీపీ వాళ్లు ధనికులయ్యారని ఆయన ఆరోపించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన శివశక్తి డైయిరీలో లీటర్ పాలకు కేవలం రూ.18 మాత్రమే చెల్లించే పరిస్థితి ఉందన్నారు. కానీ టీడీపీ నిలదీయడంతో ఫిబ్రవరి నుంచి ధర పెంచి ఇస్తున్నారని ఆయన తెలిపారు.
గుడివాడ క్యాసినో వ్యవహారంలో బూతుల మంత్రి కొడాలి నాని తీరును ఎండగట్టడంలో పార్టీ నేతలు బాగా పని చేశారని ఆయన వారిని మెచ్చుకున్నారు. మండల, నియోజవర్గ స్థాయిలో వైసీపీ నేతల వసూళ్లు, భూ కబ్జాలపై పెద్దఎత్తున ఫిర్యాదులు ఉన్నాయన్నారు.
ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియాపై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మళ్లీ విద్యుత్ చార్జీల పెంపు, రకరకాల పన్నులతో ప్రజలను పీల్చుకుతినేందుకు సిద్ధం అయ్యారని ఆయన ఆరోపించారు.