మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పెద్ది బొండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా సిద్ధార్థ్ మాజీ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్, ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతిరెడ్డి వివాహం చేసుకోనున్నారు.
ఇద్దరూ యుఎస్‌లో కలిసి చదువుకున్నారు. చాలా కాలంగా ఒకరికొకరు తెలుసు. ఇద్దరూ టీడీపీ రాజకీయాల్లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు.
జశ్వంతి ఇప్పటికే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించడం మొదలుపెట్టారు. తండ్రి ఏవీ సుబ్బారెడ్డి బాటలో నడుస్తూ ఆయన వారసత్వాన్ని అందుకోవాలని చూస్తున్నారు.
భూమా నాగిరెడ్డికి కుడిభుజంగా ఉన్న సుబ్బారెడ్డి ఇప్పుడు భూమా కుమార్తె, మాజీ మంత్రి అఖిల ప్రియ నుంచి దూరమయ్యారు. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా జశ్వంతిని టీడీపీ బరిలోకి దింపుతోంది.
బోండా ఉమా కూడా తన కుమారుడు సిద్ధార్థ్‌ను విజయవాడ రాజకీయాల్లో ప్రమోట్ చేస్తున్నారు. సిద్ధార్థ్ విజయవాడ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. సిద్ధార్థ్, కేశినేని నాని కుమార్తె శ్వేత మధ్య జరిగిన పోరు బోండా ఉమా, నాని మధ్య పోరుకు మూలకారణమని పలువురు చెబుతుంటారు.
ఇప్పటికే టీడీపీ నేతలు గంటా శ్రీనివాసరావు, నారాయణ పిల్లలు ఒక్కటయ్యారు. ఇపుడు ఈ జంట కూడా ఒకటి కానుంది. కానీ ఈ యువ జంట ఇద్దరూ తమ ప్రాంతం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండటం కొసమెరుపు.