మెగా ఫ్యామిలీకి మేలు చేసిన వారికి తిట్లు, విమర్శలు వస్తే.. ఈ ఫ్యామిలీని డ్యామేజీ చేసిన వారికి మాత్రం అభినందనలు వస్తుండడంపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మెగా స్టార్ చిరంజీవి హైదరాబాద్‌లో బ్లడ్ బ్యాంకు పెట్టుకునేందుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
దీనికి సంబంధించిన అనుమతులు రాత్రికి రాత్రి మంజూరు చేసేలా అధికారులను ఆదేశించింది. అంతేకాదు.. హైదరాబాద్‌లో చిరంజీవి భారీ స్థాయిలో కట్టుకున్న బంగళాకు.. అనుమతి ఇచ్చింది కూడా చంద్రబాబు గవర్నమెంటే!
ఇవన్నీ జగమెరిగిన సత్యాలే. అయితే.. మెగా అభిమానులు, జనసేన అభిమానులు ఎపుడూ టీడీపీని కార్నర్ చేస్తూ.. విమర్శలు చేస్తున్నారు.
ఇక, డ్యామేజీ విషయానికి వస్తే.. గత వైఎస్ హయాంలోను. ఇప్పుడు కూడా చిరు ఫ్యామిలీకి జరిగిన మేలు అంటూ ఏమీ లేదు. చిరు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదన తీసుకువచ్చిందే వైఎస్ అంటారు. తర్వాత.. ఆయన పార్టీ విలీనం కావడం.. రాజకీయంగా ఇబ్బందులు పడడం తెలిసిందే.
ఇక, పవన్ కళ్యాణ్‌ను తమ వారికి ఎక్కువ డేట్లు ఇవ్వాలని వైఎస్ మనుషులు బెదిరించినట్టు పవనే చెప్పుకొచ్చారు. దీనిలో టీడీపీకి ఇన్వాల్వ్ మెంటు ఏమీ లేదు. ఇపుడు సినిమాల విషయంలో పవన్ ని వైసీపీ ఎంత టార్గెట్ చేస్తోందో కూడా తెలిసిందే. రాజకీయంగా కూడా పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేసింది వైసీపీ. జగన్ స్వయంగా ముగ్గురు పెళ్లాల గురించి పదేపదే మాట్లాడుతుంటాడు.
అదక్కడితే ఆగలేదు. ఇప్పటికీ చిరంజీవిని ఏదో ఒక రకంగా.. డ్యామేజీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 2020లో చిరుకు రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు.. ఇటీవల వైసీపీకి అనుకూలంగా ఉండే ఒక ఆంగ్ల పత్రికలో మరోసారి ఇదే విషయం ప్రచారానికి వచ్చింది. పవన్ ఆధ్వర్యంలో నడిచే 99 టీవీ కూడా చిరంజీవి పరువు తీస్తూ ఆయనకు రాజ్యసభ ఇస్తున్నట్టు రాసుకువచ్చింది.
చిరుకు భోజనానికి పిలిచి జగన్ ఇచ్చిన లీకును వైసీపీ అనుకూల పత్రిక ప్రచురిస్తే దానిని జనసేన టీవీ 99 కూడా ప్రసారం చేసింది. కానీ జనసేన వాళ్లు రాధాకృష్ణను నిందించడం అందరికీ విస్మయం కలిగిస్తోంది.
ఇక గతంలోను వైసీపీ మనుషులు అయిన శ్రీరెడ్డి, రాంగోపాల్ వర్మ ఎంత దారుణంగా మెగా కుటుంబాని అవమానించి దానిని టీడీపీపై తోశారో అందరికీ తెలిసిందే.
ఇక టీడీపీ నాయకులు ఏనాడూ పవన్ ని గాని, చిరంజీవిని గాని వ్యక్తిగతంగా తిట్టడం, అవమానించడం చేయలేదు. వారిపై దుష్ప్రచారం చేయలేదు. అప్పట్లో బ్లడ్ బ్యాంకు పెట్టుకున్నా.. ఇల్లు కట్టుకున్నా.. మేలు చేసిందే తప్ప.. ఇలా డ్యామేజీ అయ్యే పనులు చేయలేదు.
తొలుత 2020,Febలో చిరుకి YCP RS& BJP Min అని రాసింది,JSP 99Tv
మొన్న రాసింది YCP TOI
చిరు బ్లడ్ బ్యాంక్ ప్లేస్ ఇచ్చింది CBN Govt
దానిపై ఆరోపణలు,సొంతూరికీ ఏమీ చేయని చిరు అని ప్రచారంచేసింది YS
తనవారికి డేట్స్ ఇవ్వాలని YS మనుషులు బెదిరించారని చెప్పింది PK
వీటిలో TDP కేంటి సంభందం? https://t.co/SJfrD7hzxQ pic.twitter.com/5HQMnyU7q8
— Gangadhar Thati (@GangadharThati) January 25, 2022