మంత్రి కొడాలి నాని…టీడీపీ నేతలు ముద్దుగా బూతుల మంత్రి అని పిలుచుకునే మాజీ టీడీపీ నేత. తనకు ఎన్టీఆర్ అంటే గౌరమనే కొడాలి నాని…టీడీపీ అధినేత చంద్రబాబుపై మాత్రం ఒంటికాలిపై లెగుస్తారు. పెద్దా..చిన్నా…అని తేడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడడం కొడాలి నాని నైజం. అటువంటి నానిపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించినా…నాని స్థాయికి దిగజారి వ్యాఖ్యలు చేయలేదు.
అయితే, మొన్న మొన్నటి వరకు…అన్న ఎన్టీఆర్, చంద్రబాబు తమకు నేర్పిన మర్యాదను హుందాతనాన్ని కాపాడేందుకు సైలెంట్ గా ఉన్న టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా కొడాలి నానిపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొడాలి నాని చరిత్రను టీడీపీ నేత బుద్ధా వెంకన్న విప్పారు. కొడాలి నానిపై ఓ రేంజ్ లో రెచ్చిపోయిన వెంకన్న షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే రౌడీ ఇన్ స్పెక్టర్ సినిమాలో గుడివాడ రాయుడు కాదు..గుడివాడ రౌడీ అని బాలయ్య డైలాగ్ చెప్పినట్లుగా…కొడాలి నాని ఫ్లాష్ బ్యాక్ గురించి వెంకన్న చెప్పిన నగ్న సత్యాలు షాకింగ్ గా మారాయి.
అసలు కొడాలి నాని జైలు ప్రస్థానం ఏంటో చెప్పారు బుద్దా వెంకన్న. ప్రస్తుత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత వర్ల రామయ్య గతంలో పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు కొడాలి నానిని లాకప్ లో వేసి కుమ్మారని సంచలన వ్యాఖ్యలు చేశారు వెంకన్న. లారీల్లో పెట్రోల్ చోరీ చేసిన కేసులో నాని దొరికిపోయేవారని, లారీల దొంగతనంతో ఈ స్థాయికి వచ్చారని షాకింగ్ కామెంట్లు చేశారు వెంకన్న.
గుడివాడలో నానికి టికెట్ ఇచ్చింది చంద్రబాబేనని, నానిని తెలుగు యువత అధ్యక్షుడిగా చేసింది కూడా ఆయనేనని చెప్పారు. ఇందులో హరికృష్ణ పాత్ర లేదని, దీనిపై ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమని వెంకన్న సవాల్ విసిరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు గుడివాడ వస్తే వారిపై రాళ్లు వేయించిన కొడాలి నానికి బలహీన వర్గాలంటే చిన్నచూపన్నారు. కొడాలి నానికి రాజకీయ బిక్ష పెట్టిన చంద్రబాబుపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని వెంకన్న వార్నింగ్ ఇచ్చారు.