ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవరి పక్షం? అన్న ప్రశ్న తరచూ వస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు తోచినట్లుగా మాట్లాడే ఆయనకు.. దివంగత మహానేత వైఎస్ అంటే మహా ఇష్టం. అందువల్ల ఆయన కొడుకుపై కూడా బాగానే అభిమానం చూపిస్తారు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు మాటిమాటికి ఆయనపై అబద్ధాలు ప్రచారం చేశారు ఉండవల్లి. కానీ జగన్ అధికారంలో ఉంటే అరకొరా ప్రెస్ మీట్లు పెడతారు.
జగన్ మనిషి అని ఉండవల్లిపై ముద్ర పడింది. దీంతో దాన్ని పోగొట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేశారు. తనను బెదిరించారని కూడా చెప్పుకొచ్చారు. బెదిరించిన వారు జగన్ అభిమానులట, కానీ వైసీపీ వాళ్లు కాదట. మరి జగన్ అభిమానులు వైసీపీకి ఓటేయక చంద్రబాబుకు ఓటేస్తారా…. చెబితే నమ్మేలా ఉండాలి కదా ఉండవల్లి గారు.
అవన్నీ పక్కనపెడితే… పోలవరాన్ని వాడుకుని తనపై జగన్ మనిషి అనే ముద్ర పోగగొట్టుకునే ప్రయత్నం చేశారు. దీనికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే… మిగతా జిల్లాల గురించి నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నడుస్తుంది. కానీ తన గోదావరి జిల్లాలకు అన్యాయం జరుగుతుంటే దానిపై నోరు విప్పకపోతే సొంత జిల్లాలో వ్యతిరేకత వస్తుందని అర్థమవడంతో ఉండవల్లి వ్యూహాత్మకంగా ఒకే దెబ్బకు రెండు పిట్టల అస్త్రం వాడారు. పోలవరంపై జగన్ పై నిందలు వేయడం ద్వారా అటు జిల్లా ప్రజల్లో, ఇటు తటస్థుల్లో తాను జగన్ మనిషి కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు.
మరి ఈ క్రమంలో ఆయన ఏమన్నారు… అవి జనంలోకి ఎలా వెళ్లాయో చూద్దాం.
– పోలవరం కడతామని సీఎం చెప్పడం సరే. ఎలా కడతారు..? 41.5 మీటర్ల ఎత్తుకు కాఫర్ డ్యాం కట్టేసి.. స్పిల్‌వే ద్వారా నీళ్లిస్తే సరిపోతుందా? అసలు డ్యాం.. ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డ్యాంను కట్టేదెవరు? పోలవరం జాతీయ ప్రాజెక్టు. జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధానితోనో, మరొకరితోనో లోపల మాట్లాడి.. బయటకు వచ్చి మేమే కట్టిస్తామని చెప్పడం సరికాదు. కేంద్రం అంగీకరించి ఉంటే.. ఆ మాట కేంద్రంతోనే చెప్పించాలి.
– ముంపు ప్రాంతాల ప్రజలకు పునరావాసం, భూసేకరణ పూర్తయితేనే పోలవరం రిజర్వాయర్ నిర్మించడానికి వీలుంటుంది. ఇక ఇవ్వాల్సింది 7 వేల కోట్లేనని కేం ద్రం అంటోంది. దానితో ఏం చేస్తారు..? భూసేకరణ, పునరావాసానికే రూ.22 వేల కోట్లు అంచనా వేశారు. ప్రాజెక్టు, రిజర్వాయర్, పవర్‌హౌస్, పునరావాసం, భూసేకరణ బాధ్యత కేంద్రానిదే. ఆ మాట కేంద్రంతో చెప్పించి, ప్రాజెక్టు పనులు వా ళ్లకు అప్పగించి, పర్యవేక్షణ సీఎం జగన్ చూడాలి.
– అమలాపురానికి చెందిన ఓ న్యాయవాది రమేశ్చంద్రవర్మ సమాచార హక్కు చట్టం కింద పెట్టిన 200 దరఖాస్తులకు గత ఏప్రిల్‌లో కేంద్ర జలశక్తి శాఖ జవాబు ఇచ్చింది. దాని ప్రకారం విభజన అంశాలన్నీ వదిలేసినట్లే! ప్రత్యేక హోదా అనే అంశమే లేదన్నారు. అప్పట్లో చంద్రబాబు వెనుకబడిన ప్రాంతాలకు రూ.4వేల కోట్లు అడిగితే రూ.1,850 కోట్లకు ఒప్పుకొన్నామని, అందులో ఇంకా రూ.600 కోట్లు మా త్రమే ఇవ్వాలని చెప్పారు.
– పోలవరం నిర్మాణానికి 70 శాతం కేంద్రం, 30 శాతం రాష్ట్రం నిధులు భరించాలన్నారు. రైల్వే జోన్ అనేదే లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. భూసేకరణ, పునరావాసం, రీసెటిల్మెంట్ ఆఫ్ ప్రాజెక్టు అన్నీ కలిపే ఇరిగేషన్ ప్రాజెక్టు అనే సమాధానం వచ్చింది.
– ఇవాళ సీఎం జగన్ పోలవరం పూర్తి చేస్తానని చెబుతూ కేవలం కాఫ ర్ డ్యాం కట్టి, గ్రావిటీతో నీరిచ్చి, అసలు ప్రాజెక్టును వదిలేయాలన్నాడు. బాబు చేసిన పనే తానూ చేస్తున్నా డు. ఇది మంచిది కాదు.
– చిక్కుముళ్లన్నీ విప్పేశామని చెప్పే జగన్ ప్రభుత్వం.. శ్వేతపత్రం ప్రకటించమంటే స్పందించడం లేదు. నీటి నిల్వ లేకుండా ప్రాజెక్టు ఏమిటి? స్పిల్‌వే, స్పిల్ చానల్ పనులే జరుగుతున్నాయి. ఆర్ఎంసీ వద్ద మరో లిఫ్ట్ కట్టే ప్రయత్నం చేస్తున్నారు.
– ఢిల్లీలో రైతుల్ని చూడండి. ఎలా ఉద్యమిస్తున్నారో! మద్దతు ధర ఇస్తామని కేంద్రం చెబుతుంటే చట్టంలో పెట్టమంటున్నారు. మనం చట్టంలో ఉన్నవి కూడా సాధించుకోలేకపోతున్నాం. ప్రత్యేక హోదా చట్టంలో లేదు కాబట్టి ఇవ్వరు. పోలవరం చట్టంలో ఉన్నా ఇవ్వరు.
– ఇప్పటికే గోదావరిపై తెలంగాణ కాళేశ్వరంతోపాటు, అనేక ఎత్తిపోతల పథకాలు నిర్మించింది. వాటికి అనుమతుల్లేవు. గ్రీన్ ట్రైబ్యునల్ కేసులు పెట్టింది. అయినా అక్కడ ఆగిందా? మనమూ మాట్లాడం. చంద్రబాబూ మాట్లాడరు. జగన్ కూడా మాట్లాడరు.
– వరదల సమయంలో ఏటా 2వేల టీఎంసీల కంటే ఎక్కువ నీరు సముద్రంలోకి పోతోంది. వరద సమయం 60 నుంచి 90 రోజులు మాత్రమే. ఆ నీటిని నిల్వ చేసుకుంటే, ఎన్నో ప్రాంతాలకు నీరివ్వొచ్చు. పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తుకు కట్టాలి. మొదటి రామసాగర్ పేరుతో ఈ ప్రాజెక్టు ఉండేది. అంటే ఈ ప్రాజెక్టు నిర్మిస్తే భద్రాచలం రాముడి పాదాలను నీరు తాకుతుందనేవారు. తర్వాత తగ్గించారు.
– చంద్రబాబు ఏదో తగలేశారని జగన్ తప్పించుకోవడం పరిష్కారం కాదు. మోదీ మీ చెవిలో ఏమి చెప్పారో మరి! పోలవరం ప్రాజెక్టును సందర్శించడానికి వస్తే సీపీఐ నేత రామకృష్ణను అడ్డుకున్నారు. మీరు పోలవరం వచ్చినప్పుడు పోలీసులు ఏకంగా రైతులకు నోటీసు లు ఇచ్చారు. పరిహారం అడగడానికి వస్తే, చట్టప్రకారం చర్యలు తప్పవని ఆ నోటీసులో రైతులను బెదిరించారు. మీరు జనం నుంచి వచ్చిన నేత కదా! పాదయాత్ర చేశారు కదా! అక్కడ పెట్టినట్టు ఈ రైతులకు కూడా ము ద్దులు పెట్టి, మీకేమీ ఇబ్బందిలేదని చెప్పొచ్చు కదా!
– వైసీపీపై విమర్శలు చేస్తే.. రకరకాలుగా బెదిరిస్తున్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకోమంటున్నారు. అలాగైతే మరింత గట్టిగా మాట్లాడతా. ఇటీవల బీజేపీలో చేరతామని, ఆశీర్వదించమని చాలా మంది తనకు ఫోన్లు చేస్తున్నార ని.. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ వాళ్లూ అందులో ఉన్నారు.