గుంటూరు జిల్లాలోని కీలక రాజకీయ నాయకుడు.. రాయపాటి సాంబశివరావు కుటుంబ రాజకీయాలు ఏమ య్యాయి? అసలు వీరు రాజకీయాల్లో ఉన్నారా? లేరా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి కారణం.. కొన్ని నెలలుగా.. రాయపాటి ఫ్యామిలీ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీనికి ప్రధాన కారణం.. చంద్రబాబు వీరిని పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది.
తమకు సత్తెనపల్లి లేదా.. నరసరావుపేట నియోజకవర్గా ల్లో ఏదో ఒక దానిని కేటాయించాలని.. కోరుతూ వచ్చారు. అయితే.. దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో అప్పటి నుంచి ఈ ఫ్యామిలీ రాజకీయంగా దూకుడు ప్రదర్శించడం లేదు.
ఇదే ఇప్పుడు కేడర్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. కొన్ని రోజులు రాజధాని అమరావతి ఉద్యమంలో రాయపాటి కుటుంబం యాక్టివ్గా ఉంది. అయితే.. ప్రభుత్వం నుంచి పెరిగిన ఒత్తిళ్లు.. ఇతరత్రా కారణాల తో మళ్లీ ఈ ఉద్యమాలకు కూడాదూరంగా ఉంది.
ఇటీవల నిర్వహించిన రాజధాని రైతుల పాదయాత్రకు కూడా రాయపాటి కుటుంబం దూరంగానే ఉండడంతో అసలు రాయపాటి కుటుంబం ఆలోచనపై సర్వత్రా చర్చ సాగుతోంది. మరోవైపు.. రాయపాటి రంగరావు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొన్ని నెలల కిందటి వరకు అటు సత్తెనపల్లిలో దూకుడుగా ఉన్న ఈయన ఇటీవల కాలంలో వెనక్కి తగ్గారు.
ఇదిలావుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి కూడా ఈ కుటుంబంపై ఒత్తిడి లేక పోవడం మరింత చిత్రంగా మారింది. గతంలో అయితే.. రాయపాటి కుటుంబంపై అంతో ఇంతో ఒత్తిడి కనిపించేది. కానీ, ఇప్పుడు చంద్రబాబు అసలు రాయపాటి ఫ్యామిలీని పక్కన పెట్టారనే టాక్ వినిపిస్తోంది.
నియోజకవర్గాల్లో నేతల డిమాండ్లు పెరుగుతుండడం.. రాయపాటి ఫ్యామిలీ అంచనాలు.. అంతంత మాత్రంగానే ఉండడంతో చంద్రబాబు పెద్దగా వీరిని పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టినా.. నిరసనలుచేపట్టినా.. ఎక్కడా రాయపాటి ఫ్యామిలీ ఉలుకు లేకుండా పోవడం బాబుకు ఆగ్రహం తెప్పించిందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే కుటుంబం నుంచి రాయపాటి శైలజ కూడా అమరావతి ఉద్యమంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.
ఆమెకు నరసారావుపేట ఎంపీ టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే రాయపాటి వారసుడికి టిక్కెట్ ఉండదు. ఈ ఈక్వేషన్ల నేపథ్యంలో రాయపాటి ఫ్యామిలీ పూర్తిగా సైలెంట్ అయిపోయిందని టాక్ ?