కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు దొరికింది. దక్షిణాదిపై ఢిల్లీ పీఠానికి వివక్ష మొదట్నుంచి ఉందని… దానిని తరిమేయాలంటే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పెట్టి ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేయాలని సూచించారు. ఫెడరల్ ఫ్రంట్ ను ముందుండి నడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తేనే దక్షిణాదికి ప్రామఖ్యత దక్కుతుంది అని వెటరన్ నటుడు ఆర్.నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు.
దక్షిణాది రాష్ట్రాలను చాలాకాలం నుంచి చిన్నచూపు చూస్తున్నారని, ఇది ఉత్తరాది నేతలకు అలవాటైపోయిందన్నారు. ఇక సినిమా రాజకీయాలపై కూడా ఆయన స్పందించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకివ్వరు అని ప్రశ్నించారాయన. ఎంజీఆర్ కు ఇచ్చినపుడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి కదా అన్నారు. పండిట్ భీమ్ సేన్ కు అవార్డు ఇస్తారు కానీ, మన మంగళంపల్లి బాలమురళీకృష్ణకు ఇవ్వడానికి వారికి చేతులు రావన్నారు.
తాను రాజకీయాల్లోకి రాను అని, కానీ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం మంచిదని, ఈసారి గతంలోలా వెనకంజ వేయొద్దున్నారు. రైతుల నిరసన విషయంలో స్పందించిన మూర్తి…రాష్ట్రాలతో సంప్రదించి చేసుండాల్సిందన్నారు.