వైఎస్ షర్మిలను కవర్ చేయటానికి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నాన అవస్తలు పడ్డారు. ఏపీలో పార్టీ పెట్టకూడదని రూలు ఏమన్నా ఉందా ? అని మీడియాను షర్మిల ఎదురు ప్రశ్నించారు. నిజానికి పార్టీ పెట్టడానికి షర్మిల రూల్సు గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. కానీ ఆమె మాట్లాడారు. దాన్ని పట్టుకుని మీడియా ఎవరికి తోచినట్లు వాళ్ళు రాసుకుంటున్నారు. అయితే మధ్యలో బాలినేని అనవసరంగా స్పందించారు.
ఏపీలో పార్టీ పెట్టే విషయమై మీడియా ప్రశ్నించినపుడు బాలినేని ఏమీ స్పందించకుండా ఉంటే సరిపోయేది. కానీ మంత్రి ఊరుకోకుండా షర్మిల పార్టీ ఎక్కడైనా పెట్టచ్చన్నారు. అక్కడితో ఆగకుండా షర్మిలను కలుపుకుని మేమంతా వైఎస్సార్ కుటుంబమే అని తామంతా ఒకటే అని చెప్పారు. ఇక్కడే బాలినేని కవరింగ్ బయటపడిపోయింది.
తామంతా ఒకటే అని, తమది వైఎస్సార్ కుటుంబమన్నదే నిజమైతే మరి షర్మిల తెలంగాణాలో పార్టీ ఎందుకు పెట్టినట్లు ? ఆమధ్య ఒక టీవీ ఇంటర్య్వూలో షర్మిల మాట్లాడుతు డైరెక్టుగా తనకు జగన్మోహన్ రెడ్డితో వివాదాలున్నాయని చెప్పలేదు. కానీ ఇండైరెక్టుగా ఆ అర్ధం వచ్చేట్లు మాట్లాడారు. దాంతో అన్నా-చెల్లెలు మధ్య విభేదాలున్నాయనేందుకు ఆస్కారం ఏర్పడింది.
ఒకవైపు షర్మిలే అందుకు అవకాశం ఇస్తున్నపుడు మరోవైపు తామంతా ఒకే కుటుంబమని బాలినేని చెప్పటంలో అర్ధమేలేదు. అసలు షర్మిల వ్యాఖ్యల విషయంలో స్పందించాల్సిన అవసరం బాలినేనికి లేనేలేదు.
నిజంగానే అన్నా, చెల్లెళ్ళ మధ్య సమస్యుంటే అది వాళ్ళే చూసుకుంటారు. మధ్యలో తల్లి విజయమ్మ ఉన్నారు అవసరమైతే సర్దుబాటు చేయటానికి. అప్పటికీ సర్దుబాటు కుదరకపోతే వాళ్ళే గొడవలేవో వాళ్ళు పడతారు. మరి తెలిసికూడా షర్మిల విషయంలో బాలినేని ఎందుకు స్పందించారో అర్ధం కావటంలేదు.
బాలినేని రియాక్షన్ మీద షర్మిల గనుక ఏమైనా మాట్లాడితే పోయేది బాలినేని పరువే. కాబట్టి అనవసరమైన విషయాల్లో వేలు పెట్టకుండా ఉంటేనే మంచిదని బాలినేని గ్రహించాలి.