సన్నీ లియోన్.. ఈ పేరు ఎప్పుడూ ఒక సంచలనమే. భారత సంతతికి చెందిన ఈ కెనడా అమ్మాయి పోర్న్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా కుర్రకారును ఒక ఊపు ఊపేసింది. ఆ తర్వాత ఆమె ఎవ్వరూ ఊహించని విధంగా ఇండియాలో వచ్చి సెటిలైంది.
పోర్న్ స్టార్ అయ్యాక తొలిసారి ‘బిగ్ బాస్’ కోసం ఇండియాలో సన్నీ అడుగు పెట్టినపుడు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. ఆమెకు వ్యతిరేకంగా ఆందోళనలు, ర్యాలీలు జరిగాయి. వాటన్నింటినీ తట్టుకుని సన్నీ బలంగా నిలబడింది. బాలీవుడ్ సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకుంది.
తెలుగు సహా కొన్ని ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ నటించింది. కానీ కెరీర్ సంగతెలా ఉన్నప్పటికీ సన్నీ అప్పుడప్పుడూ వివాదాల్లో చిక్కుకోవడం మాత్రం మామూలే. ఇప్పుడు తాజాగా ఆమె చుట్టూ మరో వివాదం ముసురుకుంది. సన్నీని అరెస్ట్ చేయాలంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తోంది.
#Arrestsunnyleone అనే హ్యాష్ ట్యాగ్ ఆదివారం రాత్రి నుంచి ట్విట్టర్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సన్నీ చేసిన ‘మధుబన్ మే రాధా నాచె’ పాటే ఇందుక్కారణం. ఒక పాత హిందీ సినిమాలోని పాటను సన్నీతో రీమిక్స్ చేశారు ఐతే భక్తి రస ప్రధానంగా ఉన్న పాటను శృంగార తార అయిన సన్నీతో రీమిక్స్ చేయడం.. దాన్నో క్లబ్ సాంగ్ లాగా మార్చడం వివాదానికి కారణమైంది.
హిందువుల మనోభావాలను కించపరిచే ఉద్దేశంతోనే ఈ పాట చేశారంటూ ఓ వర్గం విరుచుకుపడుతోంది. సన్నీని, ఈ పాట మేకర్స్‌ను తిట్టిపోస్తూ ట్విట్టర్లో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. బాలీవుడ్లో ఇలా హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడం సర్వ సాధారణం అయిపోయిందని, ఇకపై ఇలాంటివి సహించేది లేదని.. తక్షణం సన్నీని అరెస్టు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి మరి.