నేను ఇష్టపడే యంగ్ హీరో, ఇంటెలిజెంట్ డైరెక్టర్ మరియు ఆప్తులైన నిర్మాతల ప్రెస్టీజియస్ సినిమా “పుష్ప : ది రైజ్” అనేక గొప్ప అంచనాల మధ్య రిలీజయ్యింది.
దాని తీరు తెన్నులు నా మాటల్లో ఇలా..
“పుష్ప” అంటే ఫ్లవర్ అనుకుంటివా? కాదు “ఫైర్” — తగ్గేదేలే….
100 శాతం చిత్తూరు యాస తో, చెలరేగిపోయిన నటనతో, ప్రీ-ఇంటర్వెల్ బిగ్ బ్యాంగ్ ఝలక్ తో మనల్ని మైమరపించి అల్లు అర్జున్ “అగ్గి” అర్జున్ గా సాక్షత్కరించిన ఈ సినిమా తప్పక చూడవలసినదే
AAA+ – “అగ్గి” అర్జున్ నటన, చిత్తూరు యాస, తగ్గేదేలే.అన్నట్టుగానే అద్భుత పెర్ఫార్మన్స్
AA + – ప్రీ-ఇంటర్వెల్ బ్యాంగ్
AA – సుకుమార్ కధ, కధనం
A++ -ప్రొడక్షన్ వాల్యూస్
A+ – సునీల్ విలన్ గా రూపాంతరం
B+ – రష్మిక ప్రెజన్స్
C + – గ్రేట్ ఆక్టర్ ఫహద్ ఫాసిల్ తక్కువ నిడివి ప్రెజన్స్
C – – నో ఎక్స్ట్రా ఎఫెక్ట్ నేపధ్య సంగీతం (BGM or RR )
C — అనసూయ తో చిరాకు పెట్టె పాత్ర (గెటప్ తో సహా)
C — ఊ అంటావా ఊ ఊ అంటావా సమంత పాట
వెరసి “పుష్ప : ది రైజ్” తప్పక చూడవలసిన చిత్రాల్లో ఒకటి అని చెప్పవచ్చును, ఈ పాత్ర తో ఫ్లవర్ కాదు ఫైర్ అని ప్రూవ్ చేసుకున్న “అగ్గి” అర్జున్ కు కెరీర్ లో ఒక మైలురాయి వంటిది. రసవత్తరమైన ఫస్ట్ హాఫ్ తో, మోతెక్కిన ప్రీ-ఇంటర్వెల్ బాంగ్ తో, మంచి పాటలతో నడచి, తరువాతి భాగం సెటప్ చేసే పనిగా క్లైమాక్స్ లో కంక్లూషన్, కాన్ఫ్లిక్ట్ రెసొల్యూషన్ కొరవడినా మనం సంతృప్తిగా ఫీలవుతాం
లెక్కల మాస్టారు సుకుమార్ చాలా లెక్కలు పై చెప్పిన విధంగా బాగానే చేసినా కొన్నిట్లో కన్ఫ్యూజ్ అయ్యారు.
నాకు తోచిన కొన్ని పాయింట్స్
1) అనసూయ క్యారెక్టర్ తో ఏమి సాధిద్దామనుకున్నోరో ఆయనకైనా తెలుసా ? ఆ గెటప్ ఎవరికైనా నచ్చిందా?
2) ఈ సినిమాలో అసలు విలన్ ఉన్నాడా? చూపించిన వారందరూ ముందో వెనకో (ఘోష్, సునీల్, రావు రమేష్, ఫహద్ ఫాసిల్ వగైరా ) హీరో పార్టనర్స్ ఇన్ బిజినెస్. అన్నీ పార్టనర్స్ మధ్య గొడవలే కదా
3) పవర్ఫుల్ సినిమాకు ఒక్కడైనా పవర్ఫుల్ విలన్ అవసరం కదా
4) ఈ సినిమాలో ఇంచుమించు అన్ని పాత్రలూ చట్ట వ్యతిరేక పనులు చేసే వారే ( ఒక్క రాజీనామా చేసి వెళ్ళిపోయిన మొదటి పోలీస్ ఆఫీసర్ తప్ప)
5) వరల్డ్ క్లాస్ ఆక్టర్ ఫహద్ ఫాసిల్ కు ఇప్పటికైతే పాత్ర సరిపోలేదు
6) ఒక పెద్ద సినిమాలో హీరోయిన్ పాత్ర వెయ్యి రూపాయలకు చూపు, 5 వేలకు ముద్దు, మెటా డోర్ వాన్ లో టిఫిను తో పాటు విల్లన్ దగ్గరకు అని బయలు దేరి హీరో దగ్గరికి వచ్చి అడిగిన విషయం మన మైండ్ సెట్లకు మింగుడు పడుతుందా
7)గుడ్డిలో మెల్ల లాగా హీరో ఏలక్కాయ నోట్లో పెట్టుకుని ముద్దు అడిగినప్పుడల్లా కాకుండా, తనకు నచ్చినప్పుడే ఏలక్కాయ నోట్లో లేకపోయినా పెట్టడం బాగుంది
8) ఇక సమంతా ఐటమ్ సాంగ్ తో సుకుమార్ గారు నిర్మాత డబ్బుల్ని ఎర్ర చందనం దుంగల్తో తో పాటుగా వృధాగా నదిలో పారబోశారు. పాటలో ” ఊ అంటావా మామ ఊ ఊ అంటావా” అంటుంటే “నో అంటానూ, భామా నో నో అంటానూ” అన్నట్లుంది. ఇంతకంటే ఇంద్రావతి తన సూపర్ హస్కీ వాయిస్ తో పాడిన ఈ పాటను కళ్ళు మూసుకుని విన్నా, లేదంటే సాంగ్ ప్రోమో చివర్లో 5 సెకన్ల సింగర్ పెర్ఫార్మన్స్ గమనించినా ఇది నిజమని అంటారనుకుంటాను.
ఇటీవలే ‘ఓహ్ బేబీ”, “రంగస్థలం”, “ఆ ఆఆ” సినిమాలో సూపర్ పెర్ఫార్మన్స్ తో అందరికంటే ముందుకు దూసుకెళ్లి, ఫామిలీ కంటే కెరీర్ ముఖ్యమన్నట్టుగా తెలియపరుస్తున్నా సమంతా ఈ పాటను ఎలా ఒప్పుకున్నదో ఒక అభిమానిగా నాకైతే ఆశ్చర్యంగా వుంది.
చివరగా ” ఒక టికెట్టుకి రెండు సినిమాలు “(శివరాత్రి వగైరా సందర్భాలలో) పోయి “రెండు టికెట్ లకు ఒక్క సినిమా” (రెండు పార్టులు కలిపి) అనే సుకుమార్ లెక్క ప్రేక్షకులకు తెలిసిపోయింది.
అంటే నా ఉద్దేశ్యం ఈ సినిమా రెండో పార్ట్ సంబంధము లేకుండా ఒక క్లైమాక్స్ బ్యాంగ్ తో కూడి కంక్లూడ్ అయి రెండో పార్ట్ స్కోప్ డిస్కషన్ తో ఉంటే ఇంకా అదిరిపొయ్యెది అనే !
శ్రీనివాస గోగినేని, డిట్రాయిట్, అమెరికా!