• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

“పుష్ప : ది రైజ్” రిలీజ్ కామెంట్స్

"పుష్ప" అంటే ఫ్లవర్ అనుకుంటివా? కాదు "ఫైర్" -- తగ్గేదేలే...

admin by admin
December 23, 2021
in Movies, Trending
0
0
SHARES
188
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నేను ఇష్టపడే యంగ్ హీరో, ఇంటెలిజెంట్ డైరెక్టర్ మరియు ఆప్తులైన నిర్మాతల ప్రెస్టీజియస్ సినిమా “పుష్ప : ది రైజ్” అనేక గొప్ప అంచనాల మధ్య రిలీజయ్యింది.

దాని తీరు తెన్నులు నా మాటల్లో ఇలా..

“పుష్ప” అంటే ఫ్లవర్ అనుకుంటివా? కాదు “ఫైర్” — తగ్గేదేలే….

100 శాతం చిత్తూరు యాస తో, చెలరేగిపోయిన నటనతో, ప్రీ-ఇంటర్వెల్ బిగ్ బ్యాంగ్ ఝలక్ తో మనల్ని మైమరపించి అల్లు అర్జున్ “అగ్గి” అర్జున్ గా సాక్షత్కరించిన ఈ సినిమా తప్పక చూడవలసినదే

AAA+ – “అగ్గి” అర్జున్ నటన, చిత్తూరు యాస, తగ్గేదేలే.అన్నట్టుగానే అద్భుత పెర్ఫార్మన్స్
AA +   – ప్రీ-ఇంటర్వెల్ బ్యాంగ్
AA     –  సుకుమార్ కధ, కధనం
A++     -ప్రొడక్షన్ వాల్యూస్
A+      –  సునీల్ విలన్ గా రూపాంతరం
B+      –  రష్మిక ప్రెజన్స్
C +    –  గ్రేట్ ఆక్టర్ ఫహద్ ఫాసిల్ తక్కువ నిడివి ప్రెజన్స్
C –     – నో ఎక్స్ట్రా ఎఫెక్ట్  నేపధ్య సంగీతం (BGM or RR )
C —   అనసూయ తో చిరాకు పెట్టె పాత్ర (గెటప్ తో సహా)
C —    ఊ అంటావా ఊ ఊ అంటావా సమంత  పాట

వెరసి “పుష్ప : ది రైజ్”  తప్పక చూడవలసిన చిత్రాల్లో ఒకటి అని చెప్పవచ్చును, ఈ పాత్ర తో ఫ్లవర్ కాదు ఫైర్ అని ప్రూవ్ చేసుకున్న “అగ్గి” అర్జున్ కు కెరీర్ లో ఒక మైలురాయి వంటిది. రసవత్తరమైన ఫస్ట్ హాఫ్ తో, మోతెక్కిన ప్రీ-ఇంటర్వెల్ బాంగ్ తో, మంచి పాటలతో నడచి, తరువాతి భాగం సెటప్ చేసే పనిగా క్లైమాక్స్ లో కంక్లూషన్, కాన్ఫ్లిక్ట్ రెసొల్యూషన్ కొరవడినా మనం సంతృప్తిగా ఫీలవుతాం

లెక్కల మాస్టారు సుకుమార్ చాలా లెక్కలు పై చెప్పిన విధంగా బాగానే చేసినా కొన్నిట్లో కన్ఫ్యూజ్ అయ్యారు.

నాకు తోచిన కొన్ని పాయింట్స్

1) అనసూయ క్యారెక్టర్ తో ఏమి సాధిద్దామనుకున్నోరో ఆయనకైనా తెలుసా ? ఆ గెటప్ ఎవరికైనా నచ్చిందా?

2) ఈ సినిమాలో అసలు విలన్ ఉన్నాడా? చూపించిన వారందరూ ముందో వెనకో (ఘోష్, సునీల్, రావు రమేష్, ఫహద్ ఫాసిల్ వగైరా ) హీరో పార్టనర్స్ ఇన్ బిజినెస్. అన్నీ పార్టనర్స్ మధ్య గొడవలే కదా

3) పవర్ఫుల్ సినిమాకు ఒక్కడైనా పవర్ఫుల్ విలన్ అవసరం కదా

4)  ఈ సినిమాలో ఇంచుమించు అన్ని పాత్రలూ చట్ట వ్యతిరేక పనులు చేసే వారే ( ఒక్క రాజీనామా చేసి వెళ్ళిపోయిన మొదటి పోలీస్ ఆఫీసర్ తప్ప)

5) వరల్డ్ క్లాస్ ఆక్టర్ ఫహద్ ఫాసిల్ కు ఇప్పటికైతే పాత్ర సరిపోలేదు

6) ఒక పెద్ద సినిమాలో హీరోయిన్ పాత్ర వెయ్యి రూపాయలకు చూపు, 5 వేలకు ముద్దు, మెటా డోర్ వాన్ లో టిఫిను తో పాటు విల్లన్ దగ్గరకు అని బయలు దేరి హీరో దగ్గరికి వచ్చి అడిగిన విషయం మన మైండ్ సెట్లకు మింగుడు పడుతుందా

7)గుడ్డిలో మెల్ల లాగా హీరో ఏలక్కాయ నోట్లో పెట్టుకుని ముద్దు అడిగినప్పుడల్లా కాకుండా, తనకు నచ్చినప్పుడే ఏలక్కాయ నోట్లో లేకపోయినా పెట్టడం బాగుంది

8) ఇక సమంతా ఐటమ్ సాంగ్ తో సుకుమార్ గారు నిర్మాత డబ్బుల్ని ఎర్ర చందనం దుంగల్తో తో పాటుగా వృధాగా నదిలో పారబోశారు. పాటలో ” ఊ అంటావా మామ ఊ ఊ అంటావా” అంటుంటే “నో అంటానూ, భామా నో నో అంటానూ” అన్నట్లుంది. ఇంతకంటే ఇంద్రావతి తన సూపర్ హస్కీ వాయిస్ తో పాడిన ఈ పాటను కళ్ళు మూసుకుని విన్నా, లేదంటే సాంగ్ ప్రోమో చివర్లో 5 సెకన్ల సింగర్ పెర్ఫార్మన్స్ గమనించినా ఇది నిజమని అంటారనుకుంటాను.

ఇటీవలే ‘ఓహ్ బేబీ”, “రంగస్థలం”, “ఆ ఆఆ” సినిమాలో సూపర్ పెర్ఫార్మన్స్ తో అందరికంటే ముందుకు దూసుకెళ్లి, ఫామిలీ కంటే కెరీర్ ముఖ్యమన్నట్టుగా తెలియపరుస్తున్నా సమంతా ఈ పాటను ఎలా ఒప్పుకున్నదో  ఒక అభిమానిగా నాకైతే ఆశ్చర్యంగా వుంది.

చివరగా ” ఒక టికెట్టుకి రెండు సినిమాలు “(శివరాత్రి వగైరా సందర్భాలలో) పోయి “రెండు టికెట్ లకు ఒక్క సినిమా” (రెండు పార్టులు కలిపి) అనే సుకుమార్ లెక్క ప్రేక్షకులకు తెలిసిపోయింది.

అంటే నా ఉద్దేశ్యం ఈ సినిమా రెండో పార్ట్ సంబంధము లేకుండా ఒక క్లైమాక్స్ బ్యాంగ్ తో కూడి కంక్లూడ్ అయి రెండో పార్ట్ స్కోప్ డిస్కషన్ తో ఉంటే ఇంకా అదిరిపొయ్యెది అనే !

శ్రీనివాస గోగినేని, డిట్రాయిట్, అమెరికా! 

Tags: pshpa the rise
Previous Post

ఆ లెక్క తేలుస్తా…వైసీపీకి లోకేష్ డెడ్లీ వార్నింగ్

Next Post

వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగులకు షాక్

Related Posts

Trending

వైసీపీ కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్‌ను తిడితే ఊరుకుంటారా నానీగారూ!!

May 29, 2023
Trending

పొత్తుల‌పై తేల్చ‌ని చంద్ర‌బాబు.. కిం క‌ర్త‌వ్యం?!

May 29, 2023
Trending

జ‌గ‌న్ మ‌ళ్లీ వ‌స్తే…ఏం జ‌రుగుతుందో చెప్పిన అయ్య‌న్న‌

May 29, 2023
Trending

వైసీపీ రౌడీలూ.. ఖ‌బ‌డ్దార్‌: వైసీపీకి చంద్ర‌బాబు వార్నింగ్‌

May 29, 2023
jagan in parliament
Andhra

పార్ల‌మెంటు ప్రారంభోత్స‌వం వేళ‌.. జ‌గ‌న్‌ కు ఘోర అవ‌మానం.. ఏం జ‌రిగింది?

May 29, 2023
ys jagan
Politics

ఏం చేశార‌ని ఓటేయాలి.. వైసీపీపై పెరుగుతున్న అవిశ్వాసం!

May 28, 2023
Load More
Next Post

వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగులకు షాక్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • NRI TDP-London-లండన్ లో అంగరంగ వైభవంగా శక పురుషుని శత జయంతి వేడుకలు!
  • ఢిల్లీలో మఠాధిపతులకు మోడీ మార్క్ రాచమర్యాదలు
  • వైసీపీ కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్‌ను తిడితే ఊరుకుంటారా నానీగారూ!!
  • బాల‌య్య ఫొటోపై వైసీపీ యాగీ.. ఏం జ‌రిగిందంటే!
  • పొత్తుల‌పై తేల్చ‌ని చంద్ర‌బాబు.. కిం క‌ర్త‌వ్యం?!
  • పార్లమెంటు ప్రారంభోత్సవ వేళ.. తీపికబురు చెప్పిన మోడీ
  • జ‌గ‌న్ మ‌ళ్లీ వ‌స్తే…ఏం జ‌రుగుతుందో చెప్పిన అయ్య‌న్న‌
  • కొత్త పార్ల‌మెంటు…`శ‌వ‌పేటిక‌`.. దారి త‌ప్పిన ప్ర‌తిప‌క్షం విమర్శ‌లు!
  • వైసీపీ రౌడీలూ.. ఖ‌బ‌డ్దార్‌: వైసీపీకి చంద్ర‌బాబు వార్నింగ్‌
  • పార్ల‌మెంటు ప్రారంభోత్స‌వం వేళ‌.. జ‌గ‌న్‌ కు ఘోర అవ‌మానం.. ఏం జ‌రిగింది?
  • ఏం చేశార‌ని ఓటేయాలి.. వైసీపీపై పెరుగుతున్న అవిశ్వాసం!
  • సంచలన హామీలు – డబ్బుల వర్షం కురిపిస్తున్న చంద్రబాబు
  • తెలుగుదేశం సంచలన హామీ – ఏపీ ప్రతి స్త్రీకి నెలకు 1500
  • ఏం జనంరా బాబూ….
  • అయితే.. ఆ లెక్క‌న వైసీపీ ఖాళీయేనా?

Most Read

సాఫ్ట్ వేర్ : 4 నెల‌లు.. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు.. ఫ‌ట్‌!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

NRI TDP USA-న్యూయార్క్`టైమ్ స్కేర్‌`లో రోజంతా ‘అన్న‌ ఎన్టీఆర్’ ప్ర‌క‌ట‌న‌!

ఏపీ సీఎం బిగ్ మిస్టేక్.. 10 వేల కోట్ల కోసం..

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra