తమిళనాడులోని మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి ఆరేళ్ల కిందట విరమణ చేసిన.. జస్టిస్ చం ద్రు.. నిన్న మొన్నటి వరకు ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ, ఇటీవల జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా.. ఏపీకి వచ్చిన ఆయన..సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తమకు న్యాయం జరగదని భావించే ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాలను రద్దు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ఏపీ ప్రభుత్వం ప్రతిపక్షాలతో ఫైట్ చేయడం కంటే.. న్యాయవ్యవస్థతో పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. అంతేకాదు.. భావప్రకటన స్వేచ్ఛ ఉందని.. కాబట్టి తీర్పులను కూడా కొంత మేరకు విమర్శించే హక్కుందని.. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాల్సినంత పనిలేదని.. వ్యాఖ్యానించారు.
అయితే.. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీయడం.. హైకోర్టు కూడా సీరియస్ కావడం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీపై ఇంత ప్రేమ కురిపించిన.. జస్టిస్ చంద్రుకు ఆ పార్టీతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే చర్చ సాగుతోంది.
నిజానికి సొంత పార్టీ నేతలు కూడా ఇంత ప్రేమగా మాట్లాడి ఉండరు. లేదా.. సీఎం జగన్ నుంచి పదవులు తీసుకున్న మేధావులు కూడా ఇలా వ్యాఖ్యానించి ఉండరు. కానీ, జస్టిస్ చంద్రు మాత్రం.. కరగుగట్టి న వైసీపీ అభిమానికన్నా ఎక్కువగానే రియాక్ట్ అయ్యారు.
అయితే.. తాజాగా.. ఆయనకు వైసీపీతో ఉన్న రిలేషన్‌కు సంబంధించి.. ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. వైసీపీకి, జగన్ కు మద్దతుగా మాట్లాడే ప్రముఖ కాలమిస్ట్, జర్నలిస్టు తెలకపల్లి రవితో జస్టిస్ చంద్రు కలిసి ఉన్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది.
దీంతో జస్టిస్ చంద్రుకు వైసీపీతో ఉన్న సంబంధాలపై మరోసారి చర్చ జరుగుతోంది. మరి మున్ముందు.. ఇంకేం చూడాల్సి ఉంటుందో చూడాలి. కొసమెరుపు ఏంటంటే.. మాజీ న్యాయమూర్తులు జగన్ ప్రభుత్వంలో లబ్ధి పొందుతుండడం. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే వ్యాఖ్యానించారు. ఏదో ఆశించి ఇలా వ్యాఖ్యానించి ఉంటారని.. చంద్రుపై పరోక్షంగా.. బాబు విమర్శలు గుప్పించారు. మరి ఇదే నిజమవుతుందేమో.. చూడాలి.