సినిమా విడుదలై పది రోజులు గడిచినా ‘అఖండ’ ప్రభంజనం ఆగలేదు.ఈ సినిమా హిట్ అవడమే కాదు… బాలయ్యకు మార్కెట్ లేదు అని ప్రచారం జరిగిన చోట కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది.
బాలయ్యకు అంత పేరు రావడం ఇష్టం లేని కొందరు దానికి కూడా కులాన్ని అంటగట్టే ప్రయత్నం చేశారు. వారందరికీ చెంపదెబ్బ కొట్టేలా కలెక్షన్లు కురిపించి’న అఖండ’… ఇది అందరి సినిమా అని మరోసారి నిరూపించింది.
అమెరికాలో ఉన్న ఒక ఆధ్యాత్మిక వర్గం ఈ సినిమా ప్రత్యేక షో వేయించుకుని చూడటం కాకుండా… సినిమా చూశాక వారొక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు.అదేంటంటే… ‘అఖండ’ సక్సెస్ ర్యాలీని ఏర్పాటు చేయాలని.
విచిత్రం ఏంటంటే ఎక్కడైనా సక్సెస్ ర్యాలీలు అభిమానులు ఏర్పాటుచేస్తారు. అమెరికాలో తొలిసారి అభిమానులు కాని వారు పైగా ఒక ఆధ్యాత్మిక వర్గం వారు బాలయ్య సినిమా అఖండకు సక్సెస్ ర్యాలీ ఏర్పాటుచేయడం విశేషం.
భారీ చలిలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రీమాంట్ లో పెద్ద సంఖ్యలో కార్ల ర్యాలీ ఏర్పాటుచేయడంతో ఈ విషయం తెలుసుకున్న ఇతర తెలుగు వారు బాలయ్య అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉదయ్ కిరణ్ శిష్టా, నిరంజన్ నందిమండలం, అరవింద్ మున్సూరి, వెంకీ, గంగ, చందు, లక్ష్మణ్ తదితరులు ఈ ర్యాలీలో కీలకంగా ఉన్నారు.