రాయలసీమలో ఇటీవల సంభవించిన వరదలు ప్రజలకు ఎంత నష్టం కలిగించాయో తెలిసిందే.
దీనిపై అందరి మనసు కలచివేసింది. జగన్ మాత్రం సినిమా వారిపై కక్ష తీర్చుకోవడంలో బిజీగా ఉండి వరద బాధితులను గాలికొదిలేశారు.
ఇంతవరకు ఏపీ రెండున్నరేళ్లలో వరద బాధితులకు ఇస్తామని చెప్పిన అమౌంట్ కూడా సరిగా ఇవ్వలేదనే విషయం ఈ మధ్యనే బయటకు వచ్చింది. గవర్నమెంటే సరిగా ఇవ్వాల్సిన సాయం ఇవ్వకుండా సినిమా వాళ్లు ఎందుకు ఇవ్వరు? అని మంత్రి పేర్నినాని అడగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మరి తప్పదనో, ఇవ్వకపోతే బాగోదనో సినిమా వాళ్లు విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టారు.
మహేష్, చరణ్, ఎన్టీఆర్… విరాళాలు పాతిక లక్షల చొప్పున ఇచ్చారు.
ఇపుడు పాన్-ఇండియా సినిమాలు చేస్తూ సూపర్ స్టార్ గా ఎదుగుతున్న ప్రభాస్ APCMRFకి భారీగా విరాళం ఇచ్చారు. ఏపీ వరద సహాయానికి గాను ఆయన కోటి రూపాయల విరాళం అందించారు.
కోవిడ్ కష్టాల సమయంలో, ప్రభాస్ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఏకంగా కోటి రూపాయలను విరాళంగా ఇచ్చిన ప్రభాస్, ప్రధానమంత్రి సహాయ నిధికి మరో రూ.3 కోట్లు అందించిన విషయం తెలిసిందే.