చంద్రబాబు కు భాషతో ఆడుకోవడం రాదు గాని కంటెంట్ తో కొట్టడం వచ్చు. కాకపోతే రాజకీయాల్లో భాషదే డామినేట్ కాబట్టి జగన్ కేసీఆర్ వంటి వారు రాజ్యమేలుతున్నారు. చంద్రబాబు తాజా కామెంట్స్ చూస్తే జగన్ సర్కారు గొప్పలు గాలి బుడగల్లా పేలిపోతాయి.
ఎన్టీఆర్ హయాంలో రూపాయి విలువ చాలా ఎక్కువ ఆనాడే 35 రూపాయల పింఛను ఇచ్చారు ఎన్టీఆర్. అంటే పింఛను మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. తర్వాత చంద్రబాబు వచ్చాక దానిని డబుల్ చేసి రూ.75 గా చేశారు. ఆ తర్వాత వైఎస్ అధికారంలోకి వచ్చారు ఆయన దానిని 125 పెంచి 200 చేశారు. పదేళ్ల పాటు 200 రూపాయలే ఇచ్చారు, వైఎస్ రెండోసారి గెలిచాక కూడా పెంచలేదు అని చంద్రబాబు అన్నారు.
కానీ తాను అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ఇప్పటికంటే ఎక్కువ డబ్బుల కొరత ఉన్నా 200 పింఛను 1000 చేశాను అని చంద్రబాబు చెప్పారు. ఇది వాస్తవమే. మళ్లీ 2019లో ఆ పింఛను కూడా డబుల్ చేశారు చంద్రబాబు. అయితే, నేను 3 వేలు పింఛను ఇస్తాను అని జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఏడాదికోసారి పెంచుతాను అని మాట మార్చాడు జగన్ అని చంద్రబాబు విమర్శించారు. అయినా అది కూడా సరిగా ఇవ్వలేదు. మొదటి ఏడాది 250 పెంచి రెండో ఏడాది ఎగనామం పెట్టారు. తండ్రీ కొడుకులు తమ జీవితంలో పెంచిన పింఛను 250+125 = 375 మాత్రమే. కానీ నేను 1800 రూపాయలు నా హయాంలో పింఛను పెంచాను అని చంద్రబాబు వివరించారు.
ఎవరు మాట తప్పేవారో, ఎవరు మీకు సాయం చేసేవారో తెలుసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.