ఆర్ఆర్ఆర్ సినిమాకి చాలా ప్రత్యేకతలున్నాయి. వాటిలో ఆలియా భట్ ఫిమేల్ లీడ్‌గా కనిపించడం కూడా ఒకటి. బాలీవుడ్ బిజీయెస్ట్ హీరోయిన్ అయిన ఆమె, రామ్ చరణ్ పక్కన నటించడానికి ఓకే చెప్పడం మెగా ఫ్యాన్స్‌ని సంతోషంలో ముంచేసింది.
ఆలియా మంచి యాక్ట్రెస్. తన పర్ఫార్మెన్స్తో ఏ పాత్రనైనా అదరగొట్టేస్తుందనే పేరు తెచ్చుకుంది. అందుకే జక్కన్న కూడా ఆమెని ఏరి కోరి సీత పాత్రకు సెలెక్ట్ చేశాడు.
అయితే ఈ సినిమాలో అందరూ అనుకునేంత సీన్ ఆలియా పాత్రకి లేదనే వార్తలు బాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల చుట్టూనే తిరిగే ఈ మూవీలో అజయ్ దేవగన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తన పాత్ర కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే ఉంటుందని ఇప్పటికే లీకయ్యింది. అలాగే ఆలియా పాత్ర కూడా చిన్నదేనట. సినిమా అంతా ఉండదట. మొత్తం కలుపుకుని పదిహేను నిమిషాలు మాత్రమే ఆమె కనిపిస్తుందట.
లేటెస్ట్గా బైటికొచ్చిన ఈ విషయం విని మెగా ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు. చరిత్ర ప్రకారం రామరాజుకి సీతంటే ప్రాణం. ఆమెకి అతనే ప్రపంచం. కానీ వాళ్లిద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్‌కి సినిమాలో స్కోప్ అంతగా ఉండకపోవచ్చనే అందరూ అనుకున్నారు.
అయితే ఫిక్షనల్ స్టోరీ కనుక రాజమౌళి అవకాశం కల్పిస్తాడేమోననే ఆశ మాత్రం బలంగా ఉంది ఫ్యాన్స్‌లో. అసలు ఏ సంబంధం లేని అల్లూరిని, కొమురం భీమ్‌ని కలిపినవాడు వీళ్లిద్దరినీ కలిపి కాస్త రొమాంటిక్ టచ్ ఇవ్వడా అనుకున్నారు.
ఇప్పుడు వచ్చిన వార్తతో వారి ఆశలమీద నీళ్లు చల్లినట్టయ్యింది. ఆ పదిహేను నిమిషాల్లో ఏమని చూపిస్తారు, ఎంతని చూపిస్తారు అంటూ పెదవి విరుస్తున్నారు. అటు బాలీవుడ్లో కూడా ఆలియా ఈ పాత్ర చేయడం పట్ల అసంతృప్తితో ఉన్నవారు ఉన్నారు.
రీసెంట్గా ఆలియాతో పని చేసిన ఓ డైరెక్టర్ ఈ విషయంపై రియాక్టయ్యాడని నార్త్ మీడియాలో న్యూస్ రౌండ్లు వేస్తోంది. ‘గంగూబాయ్ కథియావాడి లాంటి సినిమాలో లీడ్ రోల్ చేసిన ఆలియాకి, కేవలం పదిహేను నిమిషాల క్యారెక్టర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది తన కెరీర్లోనే అతి చిన్న పాత్ర. ఇలాంటివి చేసి తన విలువ తాను ఎందుకు అలా తగ్గించుకుంటోంది?’ అంటూ అతను దాదాపు మండిపడినంత పని చేశాడట.
రాజమౌళి లాంటి డైరెక్టర్‌తో వర్క్ చేయాలనే ఆశ అందరికీ ఉంటుంది. ఆలియాకి కూడా ఉంది. అందుకే ఓకే అని ఉంటుంది. మరి ఆమెకి తన సినిమాలో జక్కన్న ఎలాంటి స్థానం కల్పించాడో సినిమా చూశాకే తెలుస్తుంది.