తెలంగాణ రాజకీయాల్లో తనకు ప్రత్యేక స్థానం ఉందని ఈటల మరోసారి నిరూపించుకున్నారు. ఎదురేలేదని అనుకుంటున్న టీఆర్ఎస్ కుంభస్థలాన్ని బద్దలుకొట్టి.. తనకు తిరుగులేదని గులాబీ బాస్‌కు సంకేతాలు పంపించారు. ఈటల అంగబాలన్ని విచ్చిన్నం చేయడానికి గులాబీ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆత్మవిశ్వాసంతో ఎదురీది తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. విజయోత్సాహంతో ఉన్న ఈటల.. ఇప్పుడు బదులు తీర్చుకుర్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట.
కరీంనగర్ జిల్లాకు టీఆర్ఎస్ కు విడదీయరాని బంధం ఉంది. 2001లో కేసీఆర్ అక్కడి నుంచే టీఆర్ఎస్ పార్టీ అక్కడి నుంచే ప్రకటించారు. కేసీఆర్ ఏ పని తెలపెట్టినా అక్కడి నుంచే మొదలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. కరీంనగర్ జిల్లాలో మోజార్టీ స్థానాలను టీఆర్ఎస్ కే కట్టబెడుతున్నారు.
గత లోక్‌సభ ఎన్నికల నుంచి పరిస్థితి తారుమారవుతూ వస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నుంచి కేసీఆర్ సన్నిహితుడు వినోద్‌కుమార్ పోటీ చేసి బండి సంజయ్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఈటల రూపంలో గులాబీపార్టీ కొత్త కష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయని అంటుంన్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో ఈటల ప్రకటించినట్లు ఇప్పుడు రివేంజ్ తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారట. హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో తన ఓటమి కోసం ఇన్ చార్జీలుగా పనిచేసిన టీఆర్ఎస్ నేతల భరతం పడతానని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తన అనుచరులను రంగంలోకి దింపి.. వారిని గెలిపించుకుని టీఆర్ఎస్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఊవ్విళ్లూరుతున్నారని ఈటల సన్నిహితులు చెబుతున్నారు.
ఈటల టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈటల వర్సెస్ గంగుల అన్నట్లుగా తలపడ్డారు. హుజురాబాద్ లో ఈటలను ఓడించే బాధ్యత గంగుల భుజాలపై కూడా వేసుకున్నారు. ముందుగా గంగుల కమలాకర్ కు ఈటల చెక్ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోమంత్రి కొప్పుల ఈశ్వర్, ధర్మపురి నియోజకవర్గం నుంచి స్పల్ప మెజార్టీలో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో కొప్పులను ఢీ కొట్టేందుకు బీజేపీ నుంచి వివేక్ కుటుంబాన్ని బరిలోకి దింపుతున్నారట. ధర్మపురిలో ఈటలకు మంచి పట్టు ఉంది. కొప్పులను ఓడించేందుకు ఈటల గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తుల ఉమ, బొడిగ శోభలు ఈటలతో సన్నిహితంగా ఉంటున్నారు. శోభకు కేసీఆర్ 2018లో టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈటల బీజేపీలో చేరిన తర్వాత శోభ, ఈటల విజయం కోసం తీవ్రంగా కృషి చేశారు. అయితే ఇందుకు ప్రతిఫలంగా చొప్పదండి నుంచి శోభను పోటీ చేయించి.. ఎమ్మెల్యే రవిశంకర్ ను ఓడించి.. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఈటల భావిస్తున్నారట. ఎందుకంటే హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటలను ఓడించేందుకు రవిశంకర్ ప్రచారం చేశారు.
ఇక వేములవాడ నియోజకవర్గంపై ఈటల వర్గం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈటలతో పాటు తుల ఉమ బీజేపీలో వచ్చారు. అప్పుడు ఆమె ఈటలకు ఓ కండీషన్ పెట్టారట. 2018లో ఉమ, వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈటలకు ఉమ అత్యంత సన్నిహితురాలు. ఈ సారి ఆమెను వేములవాడ నుంచి పోటీకి దింపుతారని, గెలుపు బాధ్యతలను ఈటల తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాలపై ఈటల ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో తన అనుచరులను గెలిపించుకుని టీఆర్ఎస్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఈటల రాజేందర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.