అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారి కుటుంబానికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ గాంధీ విగ్రహం దగ్గర బోస్టన్ NRI లు ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో అంకినీడు, కోటేశ్వర రావు, శ్రీనివాస్, అరుణ, సూర్య, త్రిభువన్, శ్రీనివాస్, అనిల్, చంద్ర, కిషోర్ మాట్లాడుతూ రాష్ట్రములో అరాచక పాలన నడుస్తుందని, అసెంబ్లీలో ఎప్పుడు చూస్తామనుకొని దృశ్యాలు చూడవలసివచ్చిందని విచారం వ్యక్తం చేశారు.
ఇంత బాధలో కూడా కుటుంబాన్ని పక్కన పెట్టి ఒక అమ్మలాగా వరద బాధితుల కోసం నారా భువనేశ్వరి గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో వేలమందికి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు.
దానిలో భాగంగా మేము సైతం అంటూ $2000 (1లక్ష 50 వేల రూపాయలు) విరాళాన్ని అప్పటికప్పుడు సేకరించి తమ ఉదారతను చాటుకుంటూ తామందరం ఈ స్థాయిలో ఉండటానికి చంద్రబాబు గారి ముందు చూపేనని గుర్తు చేసుకున్నారు.
విలువలు విశ్వవర్ధనీయనతా అని చెప్పుకోవటం కాదు చేసి చుపిస్తున్నామని, దమ్ముంటే ప్రజలకు విశ్వతనీయత తోటి కూడిన పాలన అందించాలని, మైసభ ని తలపించిన సచివాలయం ని ప్రక్షాళన చేయాలనీ, మళ్లి తమ నాయుడుని రారాజుగా నిలబెట్టడం కోసం శ్రీకృష్ణుడు అర్జునుడి కి గీతోపదేశం చేసి కురుక్షేత్ర రణరంగం లోకి పంపినట్టు, తాము కూడా శ్రీకృషుడి వలె తమ నాయకుని వెన్నెంటే వుంటూ కొండంత అండగా ఉంటూ ప్రతిక్షణం శ్రమిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రతి కార్యకర్త కూడా తమ ఛాలెంజ్ ని స్వీకరించి, ఆచరిస్తారని ఆశించారు.
ఈ కార్యక్రమంలో సురేష్, తేజ, నాగేంద్ర, సురేష్, శివ, విక్రమ్, అప్పారావు, పవన్ ఎముకులు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా రెట్టింపు ఉచ్చాహంతో పాల్గొని “సిద్ధం సిద్ధం మేమంతా సిద్ధం, మేమంతా ఉన్నాం మీవెంటే ఉంటాం” అని నినాదాలతో గాంధీ విగ్రహము దగ్గర నిరసన వ్యక్తం చేశారు.