పెద్దకూరపాడు పోలీస్ స్టేషన్ లో టిఎన్ఎస్ఎఫ్ నేతలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు పరామర్శించారు.
చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన విద్యార్థి నాయకుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ పెద్దకూరపాడు పోలీస్ స్టేషన్ ముందు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి నారా లోకేష్ ధర్నా చేశారు.
నారా లోకేష్ వస్తున్నారన్న సమాచారంతో… పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పెదకూరపాడు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. లోకేష్ పెద్దకూరపాడు పీఎస్కు రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
తెలుగు యువత నేతలను మరో స్టేషన్కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా పెద్దకూరపాడు టీడీపీ నేతలు అడ్డగించారు. ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ నేతలకు వాగ్వివాదం జరిగింది.
ఎయిడెడ్ విద్యా వ్యవస్థను జగన్ సర్కారు నాశనం చేస్తోందంటూ.. ఇవాళ ఉదయం తెలుగు యువత నేతలు ఏపీ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు . అసెంబ్లీ ప్రధాన మార్గం వరకు వచ్చి నినాదాలు చేశారు.