కేసీఆర్ చాలా భ్రమల్లో ఉన్నారింకా.
తనపై ఈగవాలినా తెలంగాణ ప్రజలు ఊరుకోరు అని చెప్పుకుంటున్నారు.
సరిగ్గా మూడేళ్ల క్రితం అంటే ఎన్నికలకు ముందు కేసీఆర్ పరిస్థితి వేరు, నేటి పరిస్థితి వేరు.
ఆనాడు కేసీఆర్ గురించి ఎవరైనా కామెంట్ చేయాలంటే గజగజ వణికేవారు. ఎందుకంటే గంట తిరిగేలోపు ఎవరి నుంచి ఎలాంటి వార్నింగ్ వస్తుందో తెలియదు, ఎవరు ఎలా కౌంటరేస్తారే తెలియదు. రాష్ట్రంలో లెక్కలేనన్ని పోలీస్ స్టేషన్లలో లెక్కలేనంత మంది కేసీఆర్ ని తిడతావా అని కేసలు పెట్టేవారు.
కానీ నేటి సీనే వేరు. కేసీఆర్ ను బండబూతులు తిట్టినా ఆ పార్టీలోని కొందరు నేతలు తప్ప ఎవరూ ఏమీ అనడం లేదు. సోషల్ మీడియాలో కూడా కేసీఆర్ ని తిట్టిన వారికి వార్నింగులు ఇచ్చేవారు కరువయ్యారు. ఇది తెలంగాణలో వచ్చిన మార్పు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటకు ఆయుష్షు తక్కువ అని కనిపెట్టేశారు. ఆయన మాట ఎలా తిరిగేస్తారే కనిపెట్టేశారు. అందుకే తెలంగాణలో కేసీఆర్ కు గణనీయంగా మద్దతు పడిపోయింది. కేసీఆర్ మాట అంటే నాన్నా పులి అన్నట్టే ఉంటుందని అందరికీ అర్థమైపోయింది.
కేసీఆర్ ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్ గమనిస్తే గతంలో ఉన్న ఆత్మవిశ్వాసం, ధైర్యం కనిపించకపోవడాన్ని గమనించొచ్చు. తెలంగాణ నన్ను నమ్మడం మానేసిందన్న భయం కేసీఆర్ లో అడుగడుగునా కనిపిస్తోంది.
మేకపోతు గాంభీర్యంతో కేసీఆర్ నేడు బీజేపీకి వార్నింగులిచ్చారు.
మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? నన్ను తాకుతావా? మీకు (బిజెపి & టిఎస్ బిజెపి అధ్యక్షుడు) నన్ను టచ్ చేసే ధైర్యం ఉందా, నన్ను తాకి మీరు బతికి బట్టకట్టగలరా? మీరు (బీజేపీ) నన్ను జైలుకు పంపిస్తారా ? అది మీ తరం అవుతుందా. అంటూ బీజేపీ, టీఎస్ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను సీఎం కేసీఆర్ సవాల్ చేశారు.
ఈ సందర్భంగా కేంద్రంలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఆందోళన చేస్తున్న రైతులకు అండగా ఉంటామన్నారు.
గత 7 ఏళ్లలో బీజేపీ ఏం చేసింది, ఎన్నికలు వచ్చినప్పుడల్లా మీరు మత ఘర్షణలు పెంచుతున్నారు. భారతదేశ జిడిపి బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంటే తక్కువగా ఉంది మరియు కేంద్రం ప్రజలపై అనవసరమైన పన్నును పెంచింది.
అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా మనపై దాడి చేస్తోంది, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటి వరకు కుక్కలు మొరుగుతున్నాయని భావించి మౌనంగా ఉన్నామని, ఇప్పుడు మౌనంగా ఉండకుండా అవసరమైన చర్యలకు ఉపక్రమిస్తామన్నారు.
టీఆర్ఎస్పై టీఎస్‌బీజేపీ నేతల వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ, మీరు ఏది మాట్లాడితే అది మాట్లాడితే మీ (టీఎస్‌బీజేపీ నేతల) నాలుక కోస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
BJP does mistakes with Farmers and threatens to put Chief Ministers in Jail ?
I dare you to touch me !@rohini_sgh @nistula @KTRTRS @sardesairajdeep @umasudhir pic.twitter.com/upNbMUrVlF— Krishank (@Krishank_BRS) November 7, 2021
పెట్రోలు ధరలపై జగన్ బాటలో కేసీఆర్
పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం అబద్దాలు చెబుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. 2014లో 105 డాలర్లు ఉన్న ముడి చమురు ధర ఇప్పుడు 83 డాలర్లుగా ఉంది. కానీ పెట్రోలు ధరలు మాత్రం దేశంలో ఎక్కువున్నాయి. దీనికి కారణం బీజేపీ. నాలుగు రాష్ట్రాల్లో గతంలో జరిగిన ఉప ఎన్నికల కారణంగా, వారు పెట్రోల్ మరియు ఇంధన ధరలను రూ. 5 & రూ. 10 తగ్గించారు.
నేను పెట్రోలు డీజిలు ధరను తగ్గించను. కావాలంటే కేంద్రమే ఇంకోసారి తగ్గించాలని బిజెపిని డిమాండ్ చేస్తున్నాను అని కేసీఆర్ అన్నారు.
About Kcr#KcrNightmareBandisanjay pic.twitter.com/UMKeBftFub
— ???????????????????? ???????????????????????????????? (मोदी का परिवार) ???????? (@RahulN4bjp) November 7, 2021