కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29, శుక్రవారం నాడు గుండెపోటుతో మరణించారు.
నటుడు తన జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.
దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
విక్రమ్ ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తుండగా మరణించారు.
పునీత్ రాజ్ కుమార్ వయస్సు కేవలం 46 సంవత్సరాలు.
అతని మరణ వార్త విని కన్నడ సినీ జనం, అతని అభిమానులు షాక్ కు గురయ్యారు.
నిన్నటి వరకు స్టెప్స్ వేసి ఒక వేదికపై ఇటీవలే అలరించిన ఆయన ఇంత సడెన్ గా దూరం కావడం అందరికీ విస్మయమే.
నటులు యష్, దర్శన్ ఆస్పత్రికి చేరుకున్నారు. కర్ణాటక సి.ఎం కూడా ఆయన భౌతిక కాయాన్ని దర్శించుకున్నారు.
షాకింగ్… 46 ఏళ్లకే హార్ట్ ఎటాక్.. మరణం.
పునీత్ రాజ్ కుమార్… కన్నడ చిత్రసీమ పవర్ స్టార్. శాండల్ వుడ్ నెంబర్ వన్ స్టార్. హయ్యెస్ట్ పెయిడ్ స్టార్స్‌లో పునీత్ ఒకరు. సీనియర్ కన్నడ సూపర్ స్టార్, కన్నడ సినిమాలకు దేశవ్యాప్త ఖ్యాతి తెచ్చిన రాజ్ కుమార్ చిన్నబ్బాయి. పెద్ద కొడుకు శివరాజ్ కుమార్ శాండల్ వుడ్ మెగాస్టార్. అక్కడ యూత్‌కి పునీత్ అంటే పిచ్చి. ఇండియన్ సినిమాలో టాప్ 10 డ్యాన్సర్లలో పునీత్ కూడా ఒకరు. ఆయన డాన్స్‌లు సెల్యులాయిడ్ మీద కాసులు కురిపిస్తాయి. జస్ట్ 46 ఏళ్ల వయసుకే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. కానీ ఇంత చిన్నవయసులోనే ఇప్పుడు హార్ట్ ఎటాక్‌తో మరణం ఏంటని అభిమానులు గుండెలు బాదుకుంటున్నారు. ఈ మధ్యే అన్న శివరాజ్‌కుమార్ కొత్త సినిమా బజరంగీ ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొని స్టెప్పులు కూడా వేశారు. జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తూ హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలిపోయారు పునీత్ రాజ్ కుమార్. ఇది శాండిల్‌వుడ్ కోలుకోలేని షాకింగ్ న్యూస్. ఇప్పుడిప్పుడే కన్నడ సినిమాలు దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంటున్నాయి.
కన్నడ మూవీస్ టేకింగ్ అద్భుతంగా ఉంటోంది. కేజీఎఫ్‌తో శాండల్‌వుడ్ ఫేట్ మారిపోయింది. అక్కడి హీరోలంతా పాన్ ఇండియా మూవీస్ మీద దృష్టి పెట్టారు. వారిలో భారీ మార్కెట్ ఉన్న హీరోల్లో పునీత్ కూడా ఒకరు. ఈ మధ్యే రిలీజ్ అయిన యువరత్న సినిమా ఓటీటీ రేట్లు… కన్నడ ఫిలిం ఇండస్ట్రీలోనే ఓ రికార్డ్‌గా చెప్పుకుంటున్నారు. పునీత్ సినిమాలు వస్తే థియేటర్లలోనే ఫ్యాన్స్ దీపావళి పండుగ చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడం చూశాం. అంత క్రేజ్ ఉన్న హీరోకి హార్ట్ అటాక్ అంటే అక్కడి ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మధ్యే ఇదే కార్డియక్ అరెస్ట్‌తో కన్నడ హీరో చిరంజీవి సర్జా మరణించారు. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ అదే కారణంతో కుప్పకూలడం అక్కడి అభిమానలకు జీర్ణించుకోలేని విషయం
పునీత్ రాజ్ కుమార్‌కి తండ్రి ఫేమ్‌తో మాత్రమే వచ్చిన హీరో కాదు. 5 ఏళ్లకే స్క్రీన్ ముందుకు వచ్చాడు. బాల నటుడిగా నేషనల్ అవార్డ్ అందుకున్న యాక్టర్ పునీత్. 1975లో పునీత్ పుట్టారు. 1980ల్లో వచ్చిన వసంత గీత, భాగ్యవంత, చలిసువ మోదగళు, ఇరాదు నక్షత్రగళు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశారు. 1985లో వచ్చిన బెట్టడ హోవు సినిమాలో పునీత్ నటనకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నేషనల్ అవార్డ్ వచ్చింది. అదే పదేళ్లకే జాతీయ స్థాయిలో ఉత్తమ నటన ప్రదర్శించాడు. అలా తండ్రికి తగ్గ వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు.
తెలుగులో పూరీ జగన్నాథ్ తీసిన ఇడియట్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. రవితేజకి బ్రేక్ ఇచ్చిన సినిమా అది. ఆ సినిమా ఫస్ట్.. పునీత్ రాజ్ కుమార్‌తో కన్నడలో తీశాడు పూరీ. అది పునీత్ హీరోగా వచ్చిన ఫస్ట్ మూవీ. అది ఇక్కడి కంటే పెద్ద హిట్టయింది. ఆ సినిమా పేరు అప్పూ. అప్పటి నుంచి పునీత్‌ని అక్కడి ఫ్యాన్స్ అప్పూ అనే పిలుస్తారు. 200 రోజుల ఆడిన ఆ సినిమాతో ఫస్ట్ మూవీతోనే సూపర్ స్టార్ అయ్యాడు పునీత్. అక్కడి నుంచి ఆయన హీరోగా నటించిన 32 సినిమాల్లో మాక్సిమమ్ కమర్షియల్ హిట్లే.
ముఖ్యంగా పునీత్ నటించిన అరసు, మిలన, జాకీ, హుడుగరు, రణ విక్రమ, రాజకుమార, వీర కన్నడిగ ఇవన్నీ కన్నడ సీమలో సన్షేషనల్ హిట్స్. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా సినిమా ఇక్కడ ఫ్లాప్. అదే సినిమాని అక్కడ పునీత్‌తో వీర కన్నడిగగా రీమేక్ చేశారు. అక్కడ అది బ్లాక్ బస్టర్. పునీత్ మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ కూడా. ఆయనకు నచ్చి ప్రొడ్యూస్ చేసిన సినిమాలు అక్కడ మంచి హిట్లు. వాటిలో కావలుదారి, మాయాబజార్ లాంటి మంచి సినిమాలు ఉన్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న పునీత్ ఇలా హార్ట్ ఎటాక్‌తో ఇలా నిష్క్రమించడం ఎవరికైనా షాకే.
One of the most humble and down to earth actors I’ve come across..Rest in Peace brother. #PuneethRajkumar
— RAm POthineni (@ramsayz) October 29, 2021