తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఒక పెద్ద రాజకీయ కుదుపునకు కారణం అయ్యారు.
ఆయన రాకతో కేసీఆర్ కు చమటలు పట్టాయి. అయితే కేసీఆర్ ఇది ముంచే అంచనా వేసి షర్మిలను ఇక్కడ దించాడు.
10 సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకతతో చీలిపోయే ఓట్లలో క్రిస్టియన్ ఓట్లు వంద శాతం, రెడ్డి ఓట్లు కనీసం 30 శాతం రేవంత్ రెడ్డికి వెళ్లకుండా ఆపడమే లక్ష్యంగా షర్మిలను రంగంలో దించారు కేసీఆర్.
అటువైపు అన్న పెద్ద పదవిలో ఉన్నాడు. కేసీఆర్ కి అండగా ఉంటే లాభాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే మ్యూచువల్ అండర్ స్టాండింగ్ లో భాగంగా జగన్ కేసీఆర్ కలిపి షర్మిలను రంగంలో దించారు.
అయితే, ఈ ఓట్లను నా వైపు ఎలా తిప్పుకోవాలో తెలుసు అని రేవంత్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఇక రేవంత్ రాకతో కాంగ్రెస్ లోని ప్రజాస్వామ్యం దాదాపు అంతరించినట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్ క్యాడర్ ముక్తకంఠంతో రేవంత్ కు మద్దతు పలకడంతో అప్పటి వరకు ఎదురుతిరిగిన కోమటిరెడ్డి తదితరులు సైలెంట్ అయ్యారు.
వీటన్నింటి నేపథ్యంలో రేవంత్ పెడుతున్న సభలు సూపర్ హిట్ కావడం రేవంత్ కి మరింత ఊపు ఇచ్చింది.
ఆఫ్ లైన్లో, ఆన్ లైన్లో రేవంత్ దే పై చేయిగా కనిపిస్తుంది. మొత్తానికి తాను కేసీఆర్ ను అధికారం నుంచి దించి తాను సీఎం అయ్యేదాకా నిద్రపోను అంటున్నారు రేవంత్ రెడ్డి.
తాజాగా రేవంత్ రెడ్డి ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకున్నారు.
కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని, రాబోయే రోజుల్లో తన రాజకీయ కార్యాచరణ ప్రణాళికలను పంచుకున్నారు. మాజీ కాంగ్రెస్ జాతీయ చీఫ్ రాహుల్ గాంధీ తనను తెలంగాణ పిసిసి అధ్యక్షుడిని చేయడం ద్వారా తనకు పెద్ద బాధ్యతలు ఇచ్చారన్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్కు తమ పార్టీ ఉత్తమ ప్రత్యామ్నాయంగా ఎలా ఉండబోతోందో రేవంత్ ఈ ఇంటర్వ్యూలో వివరించారు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో తనకున్న రాజకీయ అనుబంధాన్ని రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
రేవంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్ కేసులపై కూడా స్పందించారు. ఆయన స్పందన మీరే చూడండి.