మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో నిన్న బంగారం ధర 0.06 శాతం తగ్గి 10 గ్రాముల మార్కుకు ₹ 47,090 వద్ద ముగిసింది. రూపాయి (INR) డాలర్ (USD) తో పోల్చితే బలపడటంతో వరుసగా మూడో రోజు బంగారం ధర తగ్గింది.
అయితే నిపుణులు ఏమంటున్నారంటే 2021 చివరి నాటికి బంగారం ధర జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంటుంది అంటున్నారు. US డాలర్లో బలహీనత, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల తగ్గుదల వల్ల బంగారానికి ఆదరణ పెరుగుతుందంటున్నారు.
దీనికి తోడు దసరా నుంచి బంగారం డిమాండ్ పెరుగుతోంది. దాంతో పాటు దీపావళి రాబోతోంది. ప్రతి ఏటా దీపావళికి బంగారం డిమాండ్ పెరుగుతుంది. అంతేగాకుండా పెళ్లిళ్ల సీజన్ కూడా రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా క్రిస్టియన్ ప్రధాన పండుగ క్రిస్ మస్ కూడా డిసెంబర్లోనే వచ్చేది.
ఈసారి ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం కూడా బంగారం ధర ర్యాలీకి మద్దతుగా ఉంది . అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 2000 వరకు వెళ్లొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఔన్స్ బంగార ధర 1,785.00 డాలర్లకు చేరుకుంది. ఇండియా ధరల్లో చూస్తే బంగార డిసెంబరు చివరి నాటికి తులం బంగారం 57000 కు చేరే అవకాశం ఉందంటున్నారు.
అల్యూమినియం, జింక్ నుంచి సహజవాయువు వరకు అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ వస్తున్నాయి. ఈ రేసులో బంగారం కూడా చేరనుందని కెనడా గోల్డ్ మైనింగ్ పరిశ్రమ ప్రముఖులు, గోల్డ్కార్ప్ ఇంక్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ డేవిడ్ గారోఫాలో, రాబ్ మెక్వెన్ అంచనా వేస్తున్నారు.