ఏపీలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలు సహా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఇప్పుడు.. ఢిల్లీవై పే చూస్తున్నారు. ఏం జరుగుతుంది? కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుంది? అనే అంశాలపై వారు తర్జన భర్జన పడుతున్నారు. ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం.. టీడీపీ అదినేత చంద్రబాబు పార్టీ నేతలతో కలిసి.. ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్తుండడమే.
సోమవారం ఉదయం.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వారికి అప్పాయింట్ మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు బృందం రాష్ట్రపతికి వివరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకరకంగా చూస్తే.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలోనూ… తర్వాత ఆయన రాష్ట్రపతిని ఢిల్లీ వెళ్లి కలవడం ఇదే తొలిసా రి.
అయితే, రాష్ట్రపతి కోవింద్‌ను ఎన్నుకోవడంలో మాత్రం చంద్రబాబు కీలక రోల్ పోషించారు. ఈ నేప థ్యంలో రాష్ట్రపతి కూడా చంద్రబాబు కోరగానే అప్పాయింట్మెంట్ ఇవ్వడం గమనార్హం. దీంతో చంద్ర బాబు ఏం చెబుతారు.. రాష్ట్రపతి ఏం చేస్తారు? అనే ప్రశ్నలు ఆసక్తిగా మారాయి.
ఇప్పటికే రెండు రాష్ట్రా ల్లోనూ తాజా ఏపీ పరిణామాలపై ఆసక్తిగా అందరూ గమనిస్తున్నారు. అయితే.. కేవలం నిన్న మొన్న జరిగిన ఘటనలే కాకుండా..ఇంకా అనేక విషయాలను చర్చిస్తారని అంటున్నారు. తన ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు.. ఆర్థిక సమస్యలు.. ఎస్సీలపై దాడులు.. గతంలో రాష్ట్రపతి ఒక ఎస్సీ వ్యక్తి విషయంలో పంపిన అభ్యర్థన విషయంలో రాష్ట్ర ప్రబుత్వం అనుసరించిన తీరును కూడా ఇప్పుడు చంద్రబాబు ప్రస్తావించే అవకాశం ఉంది.
ఇక, కేంద్రం నిధుల దుర్వినియోగం.. లా అండ్ ఆర్డర్ సహా.. అనేక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు.. తమకు కలిసి వచ్చే పార్టీలు, నాయకులతోనూ చంద్రబాబు భేటీ అవుతారని.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను త్వరలోనే ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లోనూ ప్రస్తావించే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోందని అంటున్నారు పరిశీల కులు. రెండు తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు.. ఏపీ పరిణామాల నేపథ్యం లో చంద్రబాబు ఏం చేస్తారు.. రాష్ట్రపతి ఎలా రియాక్ట్ అవుతారు? చంద్రబాబు కోరుకున్నట్టు రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందా? వంటి అనేక అంశాలపై తెలుగు వారు ఆసక్తిగా ఉండడం గమనార్హం. మరి ఢిల్లీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.