బూతులకు కేరాఫ్ అడ్రెస్ వైకాపా యూనివర్సిటీ అంటూ నారా లోకేష్ సీఎం జగన్ రెడ్డిని ర్యాగింగ్ చేశారు. ఉదయం లేస్తే ఏ మంత్రి తన శాఖకు చెందిన ఏ విషయం ప్రెస్ మీట్ పెట్టరు.
వారు మీడియా ముందు మాట్లాడితే అది కేవలం వారి బూతు విజ్జాన ప్రదర్శన తప్ప మరోటి కాదు అని లోకేష్ అన్నారు.
వైకాపా అధినేతకు, నేతలకు మతిమరుపు ఉందేమో గాని జనాలకు, ఇంటర్నెట్ కి మాత్రం అన్నీ గుర్తున్నాయి.
జగన్ వైకాపా యూనివర్సిటీ టాలెంట్ షో చూడండి…. అంటూ జగన్ రెడ్డి బ్యాచ్ ను ఓ రేంజ్ లో ర్యాగింగ్ చేశారు నారా లోకేష్.
ఈ వీడియో ప్రదర్శించి మీడియా ముందు జగన్ గాలితీసేశారు లోకేష్.
ఇన్ని వీడియో సాక్ష్యాలు పెట్టుకుని తాము జన్మలో ఒక్క బూతు కూడా మాట్లాడలేదని జగన్ పచ్చి అబద్ధాలు ఆడారే అని మీడియా విస్మయం వ్యక్తంచేసింది.
అప్పులతో తలబొప్పి కట్టిన జగన్ రెడ్డి మతిపోయి అన్ని మర్చిపోతున్నారని లోకేష్ వ్యాఖ్యానించారు.