దామోదరం సంజీవయ్య
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి మాజీ ముఖ్యమంత్రి
కాంగ్రెస్ హయాంలో 1960-62 మధ్య ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
దేశంలోనే గొప్ప రాజకీయ నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న సంజీవయ్యకు రాజకీయ వారసత్వం పెద్దగా లేదు.
అందుకే ఆయనను జనం మెల్లగా మరిచిపోయారు.
ఉన్నత స్థానానికి ఎదిగిన ఈ దళిత ప్రముఖుడిని ఆ వర్గం ప్రజలు కూడా పెద్దగా స్మరించుకోవడం లేదు. అంబేద్కర్ కి ఇచ్చిన గౌరవం, ప్రాధాన్యత దళితులు దామోదరానికి ఇవ్వరు.
అయితే, ఆయన విషయంలో పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
దామోదరం సంజీవయ్య ఇల్లు కూలిపోయింది. ఆయన జ్జాపకాలు అయిన ఆయన వాడిన వస్తువులన్నీ శిథిలం అవుతున్నాయి.
ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సంచలనంగా స్పందించారు.
సంజీవయ్య ఇంటిని, ఆయన వస్తువులను ప్రిజర్వ్ చేసి భావి తరాలకు ఆయన గురించి తెలియజెప్పేందుకు ఆయన ఇంటిని మ్యూజియంగా మార్చాలని పవన్ నిర్ణయించుకున్నారు. దీనికోసం కోటి రూపాయల నిధిని కేటాయిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా పవన్ సంచలన ప్రకటన చేశారు. ఒక గొప్ప నేత గురించి తర్వాతి తరాలకు తెలియజెప్పాలనే పవన్ ప్రయత్నాన్ని అందరూ కీర్తిస్తున్నారు. పవన్ చర్యలు ఒక్కోసారి ఊహకందవు. లేకపోతే కోటి రూపాయలు ఉన్న పళాన పంచడం సాధారణ విషయం కాదు.