దేశంలో బొగ్గు కొరత వల్ల సంభవించే విద్యుత్ కోతలకు ప్రజలను సిద్ధం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తలమునకలు అవుతోంది.
విద్యుత్తు అవసరాలను సంక్షోభాలను తట్టుకునేలా ముందుచూపుతో ఏర్పాట్లు చేసుకోవడంలో విఫలమైన జగన్ ప్రభుత్వం ఇపుడు సమస్యను అంతర్జాతీయ ఇబ్బందుల మీద తోసేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది.
విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి మరియు విద్యుత్తును ఆదా చేయడానికి ప్రభుత్వం ప్రజలను బతిమాలుతోంది. ఇందులో చంద్రబాబు మీద తోయడానికి వీలుకాక జుట్టు పీక్కుంటోంది.
విద్యుత్తు సమస్య తీవ్రంగా ఉన్నా తెలంగాణ వంటి పలు రాష్ట్రాలు ముందు జాగ్రత్తతో దానిని అధిగమించాయి. కానీ అవినీతి, సంక్షేమంలో బిజీ అయిన జగన్ వాటిని పట్టించుకోలేదు. దీంతో కరెంటు కోతలు ఏపీలో తప్పనిసరి అయ్యాయి.
ప్రజలను విద్యుత్తు కోతలకు మానిసకంగా సిద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. 2014 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కోతలు లేవు. ఎందుకంటే సంప్రదాయ ఇంధనంతోనే కాకుండా చంద్రబాబు విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీపై దృష్టిపెట్టాడు.
అపుడు 4 రూపాయలకు కరెంటు ఏపీకి అమ్మేవి ఆయా కంపెనీలు. కానీ జగన్ సర్కారు చంద్రబాబును బ్లేమ్ చేయడానికి వాటి పీపీఈలు రద్దు చేశారు. ఇపుడు బొగ్గు తక్కువ పడేటప్పటికి కరెంటు దొరక్క 20 రూపాయలకు కొనుక్కొంటున్నారు బహిరంగ మార్కెట్లో. అయినా సరిపడా దొరకడం లేదు.
ప్రజలు కోతలు అనేవి మరిచిపోయారు. జగన్ వచ్చాక కరెంటు కోతలు మొదలయ్యాయి. దీంతో ప్రజలకు చిరాకు పడుతున్నారు. ఇపుడు ప్రజల మైండ్ సెట్ కరెంటు కోతలకు అనుగుణంగా లేదు.
ఇది ఇసుక, మందు కంటే ఎక్కువ ప్రజల్లో వ్యతిరేకతను పెంచే ప్రమాదం కనిపిస్తోంది.