సినిమా వేడుకలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎవరికి వారు తమలోని పాజిటివిటీని అంతా కుమ్మరిస్తుంటారు. లోపల ఎన్ని ఉన్నా.. బయటకు మాత్రం ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఈ కారణంతోనే సినిమా వాళ్ల కార్యక్రమాలు హైలెవల్ హిపోక్రటిక్ గా ఉంటాయి.
నిజానికి సినిమా అన్నది బిజినెస్ అయినప్పుడు.. వ్యాపారంలో నిజాయితీ భాగం చాలా తక్కువగా ఉన్నట్లే.. సినిమాల విషయానికి వస్తే.. వారు చెప్పే మాటలకు.. జరిగే దానికి మధ్య పోలిక ఉండదు. కానీ.. కొన్ని సందర్భాల్లో మాత్రం రోటీన్ కు భిన్నమైన వ్యాఖ్యలు కనిపిస్తుంటాయి.
పొగడటం మామూలే అయినా.. కొన్నిసార్లు మనస్ఫూర్తిగా పొగడటం కనిపిస్తుంటుంది. తాజాగా అలాంటి సీన్.. అఖిల్.. పూజా హెగ్డే జంటగా నటించిన బొమ్మరిల్లు భాస్కర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్ లో జరిగింది.
ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా హాజరైన స్టార్ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. హీరో అఖిల్ కంటే కూడా హీరోయిన్ పూజా హెగ్డే ను ఆయన బాగా పొగిడేశారు.
“పూజా మై లవ్ యాజ్ ఎవర్..గత సినిమాలకన్నా ఈ సినిమాలో బాగా నటించావు. గ్లామర్‌తో పాటు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే హీరోయిన్లు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నారు. ఆ లిస్ట్‌లో పూజా హెగ్డే ఉంది” అని వ్యాఖ్యానించారు.
ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఇంత ఓపెన్ గా ఒక హీరోయిన్ ను పొగడటం కాస్త తక్కువని చెబుతున్నారు. మొత్తానికి పూజా హెగ్డే విపరీతంగా సంబరపడేంత భారీ కాంప్లిమెంట్ ను అల్లు అరవింద్ ఇచ్చారని చెప్పక తప్పదు.