గతంలో ఎప్పుడూ లేనంతగా ‘మా’ ఎన్నికలు పోటాపోటీ సాగుతున్నాయి. పోటీ ఉండటం తప్పు కాదు. పోటీలో అధిక్యత కోసం ఇష్టారాజ్యంగా మాట్లాడుకోవటం.. ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకోవటం లాంటివి అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.
ప్రకాశ్ రాజ్.. మంచు విష్ణు మధ్య పోటీ నడుస్తున్న వేళ.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన నరేశ్ కారణంగా పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందంటున్నారు. విచిత్రమైన విషయం ఏమంటే.. ఇదే నరేశ్ కు గత ఎన్నికల్లో మెగా కాంపౌండ్ అనుకూలంగా ఉండి.. మద్దతు ఇచ్చి.. గెలుపునకు సాయం చేసింది. ఇప్పుడు అదే నరేశ్.. విష్ణుకు అనుకూలంగా వ్యవహరించటం హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉండగా.. నరేశ్ తీరుపై నిన్నటికి నిన్న జీవిత ఘాటు విమర్శలు చేస్తే.. తాజాగా శివాజీ రాజా సంచలన ఆరోపణలు చేశారు. నరేశ్ బట్టలు విప్పదీసినంత పని చేసిన ఆయన.. గత ఎన్నికల్లో నరేశ్ మీద పోటీ చేసి ఓటమిపాలు కావటం తెలిసిందే. నరేశ్ మాటలు.. ఆయన తీరు.. ఆయన వ్యవహరించే విధానాలపై ఆయన లోతుగా.. సూటిగా విమర్శలు చేశారు.
ఓవైపు ‘మా’ ఎన్నికలపై తాను స్పందించాలని అనుకోవటం లేదని చెబుతూనే.. ఆయన నరేశ్ మీద తీవ్రంగా మండిపడ్డారు. గత ఏడాది నాగబాబు మద్దతు లేకుంటే నరేశ్ విజయం సాధించేవాడా? అప్పుడు నాగబాబు నరేశ్ కు ఎందుకు మద్దతు ఇచ్చారో ఇప్పటికి తనకు అర్థం కాలేదన్నారు.
నరేశ్ పై శివాజీరాజా చేసిన ఘాటు వ్యాఖ్యల్ని చూస్తే..
- నరేశ్ ఆడే పాచికలాటలో ప్రాణ మిత్రులు కూడా విడిపోవాల్సి వచ్చింది. నరేశ్ చిన్నపిల్లాడు. ఎప్పుడు అబద్ధాలే చెబుతాడు. అతడి నోటి నుంచి నిజాలు వచ్చిన రోజున నేను ఆశ్చర్యపోతాను. గతంలో నాపై నరేశ్ ఎన్ని అసత్య ప్రచారాలు చేశాడో తెలిసిందే.
- నరేశ్ రాకతోనే అసోసియేషన్ లో రాజకీయాలు మొదలయ్యాయి. ‘మా’ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికాలో ఫండ్ రైజింగ్ ఈవెంట్ నిర్వహించాం. అప్పుడు చిరంజీవితో పాటు పలువురు హీరో హీరోయిన్లతో కలిసి ఈ ప్రోగ్రాంను నిర్వహించాం. అప్పడు ‘మా’కు జనరల్ సెక్రటరీగా ఉన్న నరేశ్ మాత్రం రాలేదు.
- అమెరికాకు రాకుండా ఇక్కడ సమావేశాలు పెట్టి నా గురించి తప్పుడు ప్రచారం చేశాడు. అంతేకాదు అమెరికా పర్యటనకు విమాన టికెట్టు వ్యవహారంలో నేను.. శ్రీకాంత్ డబ్బులు వాడుకున్నట్లుగా ఆరోపణలు చేశారు. దీనిపై చిరంజీవి.. సినీ పెద్దలతో కలిసి ఒక కమిటీ వేసి.. విచారణ జరిపి.. అందులో నిజం లేదని తేల్చారు.
- నరేశ్ ఆరోపణలన్ని అబద్ధాలు.. అవాస్తవాలేనని తేల్చారు. శ్రీకాంత్ నేను డబ్బులు వాడుకోలేదని సదరు కమిటీ తేల్చింది. అయినప్పటికీ నరేశ్ ఇప్పటివరకు క్షమాపణలు చెప్పలేదు. నరేశ్ అసోసియేషన్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచే రాజకీయాలు మొదలయ్యాయి.
- ఇప్పుడు ‘మా’ ఎన్నికలు రచ్చకు ఎక్కటానికి కూడా అతడే కారణం. చిన్న విషయాలకు కూడా అబద్ధాలు ఆడతాడు. శ్రీకాంత్ కు.. నాకు నరేశ్ క్షమాపణలు చెప్పే వరకు అతన్ని ఇలానే తిడతానని.. అతడి వల్లే స్నేమాలు చెడిపోయాయి.
- మా’ సభ్యుల కోసం ఓ వృద్ధాశ్రమం నిర్మించాలని నేను అనుకున్నాను. దానికి ఫండ్ రైజ్ చేయడం కోసం యూఎస్‌లో మరోసారి ప్రోగ్రామ్ పెట్టాలనుకున్నాను. దీనిపై పలువురు స్టార్ హీరోలతో చర్చించాను వారు కూడా ఒకే అన్నారు. అలాగే హీరో ప్రభాస్‌ను కూడా సంప్రదించాను.
- ప్రభాస్ షూటింగ్లో భాగంగా ఈ ప్రోగ్రామ్‌కు రాలేనని, దీనిపై మీరంతగా శ్రమ తీసుకోవద్దన్నాడు. తన వాటాగా ‘మా’ కోసం 2 కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పాడు. ఆ మాట నాకెంతో తృప్తినిచ్చింది.
- ఇలా స్టార్‌హీరోహీరోయిన్స్ ప్రోగ్రామ్‌కి ఓకే అన్నాక.. నరేశ్ ప్రెస్‌మీట్ పెట్టి నాపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత వెంటనే ‘మా’ ఎన్నికలు జరిగాయి. మా ప్యానల్ ఓడిపోయింది. దాంతో ఆ ప్రోగ్రామ్ ఆగిపోయింది. నా కల అలాగే నిలిచిపోయింది.
Jaffer : 50 years in industry Nenu Legendary actor ani chepthuntadu naresh garu @NagaBabuOffl babu reaction ???????????????? pic.twitter.com/nQkJR5SN64
— Murli (@alwaysmurli) October 9, 2021