నవరత్నాలను మోయలేక వదిలేయక వైసీపీ సర్కారు నరకం అనుభవిస్తోంది.
నవరత్నాలు అమలు చేయాలంటే డబ్బంతా దానికే పెట్టాలి. రోడ్లు కూడా వేయలేరు.
అవి ఆపేసి అభివృద్ధి చేద్దామంటే మొత్తం తిరుగుబాటు… రెండింటిలో ఏదీ సరిగ్గా చేయలేక ప్రజల ఆగ్రహానికి గురవుతోంది వైసీపీ. ఇది ఆపార్టీ నిర్వహించిన తాజా సర్వేల్లో అర్థమవుతోంది.
తాజాగా విశాఖ జిల్లాలో జరిగిన సర్వే YSRCP లో అతిపెద్ద చర్చనీయాంశం అయ్యింది.
YSRCP అగ్ర నాయకత్వం చేయించిన అంతర్గత సర్వేలలో విశాఖ జిల్లాలో ఆరుగురు ఆరుగురు ఎమ్మెల్యే ల పనితీరు దారుణంగా ఉందట. వారి ఇమేజ్ ఘోరంగా పడిపోయిందట. వీరిపై ప్రజల్లో అసంతృప్తి స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయని తేలింది.
ఐదుగురు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు, ఒకరు సీనియర్ ఎమ్మెల్యే ప్రజామోదం కోల్పోయారట. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి గెలిచిన 11 ఎమ్మెల్యే సీట్లలో నాలుగు సీట్లలో ఆరింటిలో రెండున్నరేళ్లకే పూర్తి వ్యతిరేకత అంటే అది అసాధారణ విషయం.
ఈ రోజు ఎన్నికలు జరిగితే ఈ జిల్లాలో వైసీపీ 6 సీట్లు కోల్పోతుందట.
సాధారణ ఫిర్యాదులు కూడా పట్టించుకోకపోవడం, ప్రజా సమస్యలపై స్పందన లేకపోవడం, కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం వీరి డ్యామేజీకి ప్రధాన కారణాలట.
ఇక జగన్ నవరత్నాలకు మొదటి ఏడాదితో పోలిస్తే రెండో ఏడాది 9 శాతం సంతృప్తి తగ్గిందట.
ప్రజల మనోభావాలు మరియు పార్టీ ఎమ్మెల్యేల పనితీరు గురించి అవగాహన కోసం జగన్ ప్రతి జిల్లాలో ఇదే విధమైన సర్వేలను చేయిస్తున్నారు. ఇంకా ఎన్ని ఘోరాలు వినాల్సి వస్తుందో జగన్.