అదేంటి.. అనుకుంటున్నారా.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. గత ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించాం.. మా బలంతోనే గెలిచాం.. అనుకున్న నాయకులు చాలా మందికి.. ఇప్పుడు ప్రజల్లోనే కాదు.. పార్టీలోనూ సెగ పడుతోంది. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సమర్ధత కనిపించకపోవడం.. వర్గ పోరు పెరిగిపోవడం.. ఇబ్బందిగా మారింది. దీంతో ఇలాంటి నాయకులు సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
గిరిజన నియోజకవర్గం పాడేరు నుంచి గత ఎన్నికల్లో కొత్తగుళ్ల భాగ్యలక్ష్మి విజయం సాధించారు. అయితే.. ఈ రెండున్నరేళ్లలో ఆమె సాధించింది ఏమీ లేదని స్థానికంగా.. ఉన్న వైసీపీ నాయకులే ప్రచారం చేస్తుండడం గమనార్హం.
అయితే… తాను కష్టపడి.. పాడేరును అభివృద్ధి చేస్తున్నానని… సీఎం జగన్ తో మాట్లాడి… పాడేరుకు వైద్య కళాశాలను.. రోడ్ల అభివృద్ధిని సాధించానని..ఐటీడీఏ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నానని ఆమె అంటున్నారు. కానీ, స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులను ఆమె కలుపుకొని పోని ఫలితమో .. లేక.. నేను తప్ప.. నియోజకవర్గాన్ని పట్టించుకున్న వారు లేరు.
గతంలో ఉన్న నాయకులు తిని కూర్చన్న వారే.. అనే భావనో తెలియదు కానీ.. అందరినీ దూరం చేసుకుంటున్నారనే వాదన మాత్రం వినిపిస్తోంది. వచ్చే ఎన్నిల్లో భాగ్యలక్ష్మికి టికెట్ రాదు.. అనేప్రచారం మాత్రం పాడేరులో వినిపిస్తోంది.
ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లోనూ ఈమె వ్యతిరేక వర్గంగా ఉన్నవారు పట్టు సాధించారు. ఇది మరింతగా భాగ్యలక్ష్మికి సెగ పెడుతోంది. నిజానికి జగన్ పాదయాత్ర సమయంలో.. ఆయన వెంట కొన్ని కిలో మీటర్ల దూరం నడిచి.. జగన్ దృష్టిలో మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇప్పుడు కూడా..బాగానే ఉంది. కానీ, స్థానికంగా పెరుగుతున్న వ్యతిరేకతను మాత్రంఆమె గుర్తించడం లేదు. కొందరు వైసీపీలోనే ఉంటూ.. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. పైకి మాత్రం దీనిని లైట్ తీసుకుంటున్నా.. విషయాన్ని సీఎం జగన్ వరకు తీసుకువెళ్తానని..ఎమ్మెల్యే హెచ్చరికలు చేసే వరకు పరిస్థితి వచ్చింది.
అంటే. దీనిని బట్టి.. ..ఆమెకు వ్యతిరేకంగా.. ఇక్కడ వర్గ పెరిగిందనే కదా.. అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో జగన్ సునామీ కావొచ్చు.. టీడీపీ తరఫున పోటీచేసిన గిడ్డి ఈశ్వరి పై వ్యతిరేకత కావొచ్చు.. భారీ మెజారిటీతో భాగ్యలక్ష్మి విజయం దక్కించుకున్నారు.
అయితే.. ఈ లక్కీ ఛాన్స్ వచ్చే ఎన్నికల్లో మిస్ కావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి భాగ్యలక్ష్మి ఏం చేస్తారో చూడాలి.