అందం శాశ్వతం కాదు అంటారు
ఏమో మరి ఐశ్వర్యారాయ్ ని చూస్తుంటే ఈ స్టేట్ మెంట్ తప్పేమో అనిపిస్తుంది
పెళ్లయ్యి, పిల్లల్ని కని, 40 ఏళ్లు దాటిని ఆమె అందానికి మరక పడలేదు.
మరి అందం శాశ్వతం కాదంటే అనుమానం రాదా?
ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఫ్యాషన్ రన్‌వేపై చాలాకాలం తరవాత మెసిరింది.
47 ఏళ్ల ఐశ్వర్య రాయ్ లే డెఫైల్ లోరియల్ పారిస్ 2021 ఉమెన్స్ వేర్ స్ప్రింగ్/సమ్మర్ 2022 షో కోసం పారిస్ లో ర్యాంప్ వాక్ చేసింది.
ఐశ్వర్య శరీరాన్ని కౌగిలించుకున్న తెల్లని గౌనులో మెరిసిన డ్రేప్ ఆమె నడుమును, హృదయాన్ని గట్టిగా హత్తుకుంది.
సిల్వర్ ఐ షాడో … చెవికి కళ తెచ్చిన స్టడ్స్ మెరిసిపోతుండగా… ప్యారిస్ చల్లటి గాలులు వేణువు ఊదుతుంటే ఆమె నల్లని కురులు లేచి నాట్యమాడాయి.
శ్వేతవర్ణపు దుస్తుల్లో ఈ బంగారు వర్ణపు సుందరి తన ఎర్రటి పెదాలకు రాణి పింక్ తో సింగారించింది.
ర్యాంప్‌లో, హెలెన్ మిరెన్ మరియు కెమిలా కాబెల్లో వంటి ఇతర ప్రభావవంతమైన మహిళలతో ఐశ్వర్య నడుస్తుంటే ఆ దశృశ్యం మనోహరంగా ఉంది.
ఫ్యాషన్ షోకి ఈ సంవత్సరం, ఈవెంట్ థీమ్ మహిళా సాధికారత మరియు వేధింపు వ్యతిరేక ప్రచారం.
https://twitter.com/soumya7041997/status/1444958882548183044