సమంత, నాగ చైతన్య విడాకుల గురించి గత కొన్ని వారాలుగా తెలుగు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. చివరకు, స్టార్ జంట అధికారికంగా తమ విడాకులను ప్రకటించారు.
విడాకులను కన్ ఫం చేస్తూ సమంత ఈ మెసేజ్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
“మా శ్రేయోభిలాషులందరికీ విన్నపం. అనేక చర్చలు మరియు ఆలోచనల తరువాత, ఛాయ్ (నాగ చైతన్య) మరియు నేను (సమంత) భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మా స్వంత మార్గాలను అనుసరించడానికి నిర్ణయించుకున్నాం. మా ఇద్దరి మధ్య ఒక దశాబ్దానికి పైగా స్నేహం కలిగి ఉండటం మా అదృష్టం. ఇది ఇక్కడితో ఆగిపోదు.
ఎప్పటికీ మా మధ్య ఒక ప్రత్యేక స్నేహ బంధం నిలిచి ఉంటుంది. ఈ క్లిష్ట సమయంలో మా అభిమానులు, శ్రేయోభిలాషులు మరియు మీడియా మాకు మద్దతునివ్వాలని కోరుకుంటున్నాం. దీని నుంచి బయటపడి మేము ముందుకు సాగడానికి అవసరమైన ప్రైవసీని ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. మీ మద్దతుకు ధన్యవాదాలు. ” ఒక ఇమేజ్ రూపంలో దీనిని సమంత తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లలో షేర్ చేసింది.
నాగ చైతన్య కూడా అదే స్టేట్మెంట్ని తన సోషల్ మీడియాలో పంచుకున్నారు, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తమకు గోప్యత ఇవ్వమని అభ్యర్థించారు.
గత రెండు నెలలుగా వస్తున్న అన్ని వార్తలకు చెక్ పడింది. సమంత 2010 లో యే మాయ చేసావె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో నాగ చైతన్య హీరో. తరువాత, వారు ఆటోనగర్ సూర్య, మనం మరియు మజిలీ సినిమాలలో నటించారు. వారు 2017 లో వివాహం చేసుకున్నారు. వారి వివాహం దాదాపు నాలుగు సంవత్సరాలు కొనసాగింది.