‘‘తప్పులెన్ను వారు తమ తప్పులెరగరు‘‘
అని పెద్దలు ఏనాడో చెప్పారు.
ముఖ్యమంత్రిని పట్టుకుని నానా మాటలు అన్న వాళ్లు… ఇపుడు మంత్రిని ఒక పార్టీ అధినేత సన్యాసి అనగానే తెగ ఫీలైపోతున్నారు. పవన్ వ్యాఖ్యలతో రగులుకున్న ఇంకా చల్లారలేదు.
ప్రభుత్వం సినిమా పరిశ్రమలను అణచివేయాలని చూస్తుందని విమర్శలు వస్తే అదేం లేదు అని నిరూపించి చూపాల్సిన సర్కారు ఎదురుదాడికి దిగి వాళ్లు ట్యాక్స్ ఎగ్గొట్టారు, వీళ్లు ట్యాక్స్ ఎగ్గొట్టారు అని అందరి మీదా పడుతోంది.
ప్రజల వాడు అన్ని నిత్యావసరాల ధరలు పెంచి సినిమా టిక్కెట్ల ధరలు ఎక్కువ ఉంటే పేదలు చూడలేరు అని తగ్గిస్తాం అని తమను తాము కరుణామయులుగా చెప్పుకుంటున్నారు వైసీపీ నేతలు.
దీంతో సినిమా వాళ్లు దీనిపై నలిగిపోతున్నారు. ప్రభుత్వం అణచివేతను పవన్ ధైర్యంగా ప్రశ్నిస్తే సినిమా వారి నుంచి మద్దతు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇక అప్పటి నుంచి వైసీపీ జనసేన వార్ నడుస్తూనే ఉంది. తాజాగా తణుకులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి పేర్నినాని తణుకు పర్యటనకు రాగా… కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు జనసేన కార్యకర్తల ప్రయత్నం చేశారు. పవన్ కల్యాణ్‌కు క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. కాసేపు తోపులాట జరిగింది.
చివరకు పోలీసులు వారిని కంట్రోల్ చేయడంతో మంత్రి తప్పించుకున్నారు.
https://twitter.com/Amarava16668082/status/1443512702966452225