పోసాని కృష్ణ మురళి హద్దులు దాటి మాట్లాడి మరింత ప్రమాదంలోకి పోతున్నారు. అసలు పవన్ సినిమా వారి సమస్యల గురించి మాట్లాడితే తనకు సంబంధం లేకుండా సినిమా పరిశ్రమలో ఉంటూ దానికే వ్యతిరేకంగా మాట్లాడారు పోసాని. అక్కడితే ఆగితే పర్లేదు. తప్పు చేస్తున్న అధికార పార్టీని వదిలి పవన్ పై విమర్శలు చేశారు. దీంతో పోసాని తీరుపై పవన్ అభిమానులు ఆగ్రహించారు.
అతనికి ఫోన్లు చేసి తిట్టడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో పోసానిని తిట్టిపోశారు. దీంతో మళ్లీ పోసాని ప్రెస్ మీట్ పెట్టి పవన్ ని బూతులు తిట్టాడు. చరిత్రలో ఎన్నడూ ఏ సినీ రాజకీయ ప్రముఖుడు వాడని బూతులు అన్నీ పవన్ మీద వాడాడు పోసాని.
దీంతో అభిమానులకు మండిపోయింది. ఆయన ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. పవన్ అభిమానులు చేస్తున్నది చట్టం దృష్ట్యా తప్పు. అదేసమయంలో నిజానికి తనకు సంబంధం లేని విషయంపై హద్దులు మీరి మాట్లాడటం పోసాని చేసిన తప్పు.
ఇపుడు అభిమానులు రాళ్ల దాడి చేస్తే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి రక్షణ కోరాల్సిన పోసాని …. తానురాళ్ల దెబ్బలకు భయపడిపోయేవాడిని కాదని, ఇలాంటి బెదిరింపులు చాలా చూశానని పేర్కొన్న పోసాని పవన్ కళ్యాణ్ ను తానొక్కడినే చెప్పుతో కొడతాను అంటూ మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహా అయితే పవన్ ఫ్యాన్స్ నన్ను చంపేస్తారేమో అంతకంటే ఏం చేస్తారు అంటూ వ్యాఖ్యానించారు. తాజా వ్యాఖ్యలతో పోసాని సమస్యను మరింత తీవ్రం చేసే ప్రయత్నం చేశారు.
నిజానికి పోసానికి సరైన మద్దతు లేదు. ఈ నేపథ్యంలో పవన్ జోలికి వెళ్లడమే తప్పు. పవన్ నిలదీసింది ప్రభుత్వాన్ని. అది కూడా సినిమా వారి అందరి సంక్షేమం కోసమే నిలదీశాడు. పవన్ సన్నాసి అన్నందుకు పేర్ని నాని బాధపడలేదు కానీ పోసాని బాధపడ్డాడు.
కేసీఆర్ దానికి వంద రెట్ల బూతులతో ఆంధ్రోళ్లను తిట్టాడు. వైసీపీ నాయకులు చంద్రబాబును అనేక బూతులు అన్నారు. అప్పుడు సంస్కారం గురించి పోసాని ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ ఈరోజు అన్ని సంస్కారాలు గుర్తుకువస్తున్నాయి.