ఎందుకో గాని తెలుగు సినిమా ఇండస్ట్రీ జగన్ అంటే వణికిపోతుంది. అసలు వారం రోజులకు మించి ఏ సినిమా థియేటర్లలో ఆడని నేటి రోజుల్లో టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయమే సినిమాను బతికించేది. కానీ జగన్ ప్రతి రేటు పెంచుతూ సినిమా టిక్కెట్ రేటు మాత్రం తగ్గించాడు. ఇది కేవలం మెగా కుటుంబంపై ముఖ్యంగా పవన్ సినిమాలపై కక్షతో తీసుకున్న చర్య. ఇది బహిరంగ రహస్యమే. కానీ ఎవరూ దీనిపై నోరు విప్పరు. సినిమా వాళ్లు అసలు విప్పరు.
ఈ నేపథ్యంలో రిపబ్లిక్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో సినీ పరిశ్రమలోని వివిధ సమస్యలపై పవన్ కళ్యాణ్ కూలంకుషంగా మాట్లాడారు. ఏపీ సర్కారు సినిమా గొంతును ఎలా నలిపేస్తున్నది స్పష్టంగా చెప్పారు. ఏపీ సర్కారుకు వార్నింగ్ ఇచ్చారు.
మొత్తం చిత్ర పరిశ్రమ ఆవేదనను ధైర్యంగా చెప్పాడు. దీనిపై సినిమా జనాల్లో హర్షం వ్యక్తమైంది. తాను చేయలేని పని పవన్ చేసినందుకు సినిమా పెద్దలందరూ ఏకం కావాలి. పవన్ కు మద్దతు పలకాలి. ఫిల్మ్ చాంబర్ పవన్ చెప్పింది రైట్ అనాలి. ఎందుకంటే పవన్ మాట్లాడింది సినిమా వారి మొత్తం సమస్యలపైనే.
కానీ ఏపీ ప్రభుత్వం బెదిరింపులో, వైసీపీ నాయకుల బెదిరింపులో గాని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక దారుణమైన ప్రకటన విడుదల చేసింది. కొందరు వ్యక్తులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మొత్తం పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించవు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు సినిమా పరిశ్రమకు తమ మద్దతు మరియు ప్రోత్సాహాన్ని ఎల్లప్పుడూ అందిస్తున్నాయని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ నారంగ్ తమ పత్రికా ప్రకటనలో వెల్లడించారు.
సినిమా తరఫున వినతులను ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని అందులో పేర్కొనడం గమనార్హం. పవన్ గాని ఇతరులు గాని వ్యక్తంచేసిన అభిప్రాయాలు మొత్తం పరిశ్రమ యొక్క అభిప్రాయం కానేకాదు, జగన్ అద్భుతంగా సహకరిస్తున్నారు అంటూ ప్రెస్ నోట్ లో అక్షరాలు పూర్తిగా బానిసత్వపు లక్షణాలతో కనిపించాయి.
పవన్ ని ఫిల్మ్ చాంబర్ ఒక విలన్ గా చిత్రీకరించడం గమనార్హం. లవ్ స్టోరీ చిత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏపీలో బాగా రాణిస్తోంది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు ప్రభుత్వం మరియు సినిమా పరిశ్రమ మధ్య సంబంధాలకు మరింత హాని కలిగిస్తుంది అని పవన్ కళ్యాణ్ కు ఫిల్మ్ చాంబర్ షాకిచ్చింది.
We are immensely greatful to the Govt. of AP : Telugu Film Chamber. pic.twitter.com/dx1BCRkI9C
— Aakashavaani (@TheAakashavaani) September 26, 2021