వైఎస్ షర్మిల జగన్ కి పెద్ద షాకే ఇచ్చింది.
తెలుగు న్యూస్ ఛానెల్స్ లో పాపులర్ అయిన ఏబీఎన్ టీవీ… జగన్ కి అసలు నచ్చని ఛానెల్ కి వైఎస్ షర్మిల ఇంటర్వూ ఇచ్చారు.
అది కూడా అందులో వైఎస్ వివేకా మర్డర్ తో సహా ప్రతి విషయంపై రాధాకృష్ణ ప్రశ్నలు అడగడం, ఆమె వాటికి సమాధానాలు చెప్పడం విశేషం.
ఇంటర్వ్యూ రేపు ప్రసారం కానుంది. ప్రస్తుతం టీజర్ మాత్రమే విడుదలైంది
ఆ టీజర్ విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. ఈ ఆదివారం బిగ్ బాస్ రేటింగ్స్ ను షర్మిల ఇంటర్వూ డామినేట్ చేయనుందని చెప్పొచ్చు.
లక్షలలో వ్యూస్ వచ్చాయి. ఒక పొలిటికల్ ఇంటర్వ్యూ ఎపుడూ ఇంత వైరల్ కాలేదు.
ఏమిటి దీనికి కారణం… జగన్ గురించి షర్మిల ఏమన్నది? జగన్ గుట్టును షర్మిల చెప్పిందా? జగన్ మోసాలను షర్మిల బయటపెట్టిందా అన్న ప్రశ్నలకు సమాధానం కోసమే జనం ఈ ఇంటర్వ్యూ కోసం పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు.
కొసమెరుపు ఏంటంటే… ఒకప్పుడు ఇదే షర్మిల రాధాకృష్ణ, రామోజీరావులను తిడుతూ జగన్ కోసం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇపుడు అదే ఆర్కే ఆమె బాధలను ప్రపంచానికి చూపెడుతున్నారు.