మొదటి వేవ్ కు వణికిపోతే.. అదంత ప్రభావాన్ని చూపించకుండానే వెళ్లిపోయింది. ఫస్ట్ వేవ్ అనుభవంతో లైట్ తీసుకున్న దేశ ప్రజలకు సెకండ్ వేవ్ దిమ్మ తిరిగే షాకివ్వటమే కాదు.. మే నెల మొత్తం యావత్ దేశం ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసింది. ముందు ఈ మహమ్మారి నుంచి ఎప్పుడు బయటపడతామో భగవంతుడా? అన్న భావన కలిగేలా చేసింది.
ఇలాంటివేళ థర్డ్ వేవ్ ప్రస్తావన రావటంతోనే ఠారెత్తిపోయారు. సెకండ్ వేవ్ తీవ్రత తగ్గి.. థర్డ్ వేవ్ మీద పెద్ద ఎత్తున ముందస్తు ఏర్పాట్లు చేసుకోవటంతో పాటు.. అసలేం జరుగుతుందన్న ఆందోళన అంతకంతకూ ఎక్కవైన పరిస్థితి. ఇలాంటివేళ.. థర్డ్ వేవ్ రాక ఆలస్యమైందనే చెప్పాలి. ప్రస్తుతం సెకండ్ వేవ్ కొన్ని రాష్ట్రాల్లో నడుస్తోందని.. థర్డ్ వేవ్ ఇంకా షురూ రాలేదన్న మాట వినిపిస్తోంది.
అంతేకాదు.. మూడో వేవ్ మీద తీవ్ర భయాందోళనలో ఉన్న దేశ ప్రజలకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో రెండో వేవ్ కొనసాగుతోందని.. మరికొద్ది రోజుల్లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు.
అయితే.. మూడో వేవ్ తీవ్రత తక్కువగా ఉంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సీఎస్ఐఆర్ డైరెక్టర్ గా వ్యవమరిస్తున్న డాక్టర్ శేఖర్ తాజాగా మాట్లాడారు ఈ సందర్భంగా భరోసాను కలిగించేలా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతోందని.. భారీ ఎత్తున మొదటి.. రెండో డోసులు వేసుకోవటం ద్వారా.. వ్యాక్సినేషన్ కారణంగా కరోనా పాజిటివ్ అని తేలినా.. దాని తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. భారీ ఎత్తున ప్రజలు మొదటి.. రెండో డోసులు వేసుకున్నారని. ఈ కారణంగానే పాజటివ్ అని తేలినా కూడా.. తీవ్రత పెద్దగా ఉండదన్నారు.
అంతేకాదు.. వైరస్ ను చాలా వరకు నియంత్రణలో ఉందన్నారు. వైరస్ ను చాలావరకు నివారించే శక్తి టీకాల్లో ఉందని.. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కొవిడ్ పాజిటివ్ లతో ఉన్నా.. దాని తీవ్రత ఉండదని చెబుతున్నారు. థర్డ్ వేవ్ ఎలా ఉంటుందోనన్న భయాందోళన వ్యక్తమవుతున్న వారికి.. ఈ పెద్ద మనిషి చెప్పిన మాటలు కొత్త ఉత్సాహాన్ని.. అంతకు మించిన ఊరట ఇచ్చేలా ఉన్నాయని చెప్పక తప్పదు.