జగన్ వీరాభిమాని ఉండవల్లి హర్ట్ అయ్యారు.
జగన్ కి ప్రమాదం వస్తే వెంటనే వాలిపోయి కవర్ చేసే ఉద్యోగం ఎన్నికలకు ముందే జగన్ ఇచ్చారు.
కానీ రోజురోజుకీ ఆ ఉద్యోగంలో ఉండవల్లికి ఒత్తిడిపెరిగిపోయినట్లుంది.
ఎందుకంటే జగన్ తన పాలనలో తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేసుకుంటూ ఏపీలో ప్రతి వర్గాన్ని తన పాలనతో ఇబ్బంది పెడుతున్నారు.
పది విషయాలు మాట్లాడితే ఒక్కటైనా జగన్ కి పాజిటివ్ గా దొరుకుతుందంటే అది కూడా లేకుండా పోవడంతో ఇక జగన్ ని ప్రమోట్ చేస్తే తన క్రెడిబులిటీ పోయే ప్రమాదం ఉందని ఉండవల్లికి ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టుంది. అందుకే జగన్ కోసం పనిచేసే అనఫిషియల్ పీఆర్ ఉద్యోగానికి ఆయన పేపర్ లెస్ రాజీనామా సమర్పించేసేనట్టే కనిపిస్తోంది. ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో జగన్ పరిపాలనకు జీరో మార్కులు వేశాడు ఉండవల్లి అరుణ కుమార్
జనాలను నేరుగా జగన్ ఇబ్బంది పెడుతున్నట్లు చాలా స్పష్టంగా చెప్పాడు. జగన్ కమిషన్ లు మింగేస్తున్నాడని పబ్లిగ్గా చెప్పేశాడు. అసలు జగన్ మీద పదుల కొద్దీ సీబీఐ ఈడీ కేసులు ఉంటే ఆయన నుంచి ఉత్తమ అవినీతి రహిత పాలన ఊహించడం ఉండవల్లి తప్పు అవుతుంది గాని జగన్ తప్పు ఎలా అవుతుంది.
చివరకు కంపెనీలు పోయి, వ్యాపారలు పోయి, ఉద్యోగాలు పోయి ఏపీలో జనం పనీ పాటా లేక రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి రావడంతో ఇక జగన్ ని పొగిడితే తనకే ముప్పు అని ఉండవల్లికి జ్జానోదయం అయింది, అందుకే తన క్రెడిబులిటీ కేోసం ప్లేటు తిప్పేసి జగన్ మీద విమర్శలు చేశాడు.
మచ్చుకు ఈ క్లిప్ చూడండి. ఫుల్ వీడియో కూడా కిందకు స్క్రోల్ చేస్తే దొరుకుతుంది.
జగన్ చెత్త పరిపాలన నాకు నచ్చలేదు!
– ఉండవల్లి అరుణ్ కుమార్ pic.twitter.com/5uz6xahWic— TalapaReddy Veera Reddy (@tvrtdp) September 23, 2021
ఇక ఇంకో పెద్దమనిషి ఉన్నాడు. ఏపీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పెద్ద మనసుతో అందరి సంక్షేమం ఆలోచించాల్సిన ఆ పెద్దాయన అమరావతిపై కక్ష కట్టి రైతులకు పాడికట్టాడు. తెలుగుదేశం పై నిందలు వేసి చంద్రబాబుపై ప్రజల్లో తప్పుడు ప్రచారం చేశారు. బీజేపీలో చేరి జగన్ కి మేలు చేసేలా మాట్లాడుతూ వచ్చారు. ఆయనే ఐవైఆర్ కృష్ణారావు.
సరిగ్గా రెండున్నర సంవత్సరాల తర్వాత ఆయనకు జ్జానోదయం అయ్యింది. జగన్ అసలు రంగు ఆయనకు గుర్తొచ్చింది. బ్రాహ్మణ కార్పొరేషన్ ను ఎండో మెంట్ నుంచి తొలగించి బీసీ వెల్ఫేర్ డిపార్టుమెంటుకు తరలించడంతో తమ కులానికి నష్టం జరుగుతుందని పాపం తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు ఐవైఆర్.
రాజధాని, పోలవరం పోతుంటే కిమ్మనకుండా ఆజ్యం పోసి ఏపీ నాశనం అయితే నాకేంటి అన్నట్టు మాట్లాడిన ఐవైఆర్ ఇపుడు తన కులానికి నష్టం జరిగే నిర్ణయం జగన్ తీసుకునేటప్పటికి తెలుగుదేశం మంచిపనులు చేస్తుందన్న విషయం గుర్తొచ్చింది. ఆ విషయాన్ని ఇలా తన ట్వీట్లో ప్రస్తావిస్తూ జగన్ పై విమర్శలు చేశారు. అంత పెద్ద చదువులు చదువుకుని రాష్ట్రానికి ఏ పాలన మేలు అనే అవగాహన లేకుండా విమర్శలు చేసినందుకు ఆయన ఇపుడు మనో వేదన చెందుతున్నారేమో. ఆయన లేటెస్ట్ ట్వీట్ చూడండి.
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రారంభమైన బ్రాహ్మణ కార్పొరేషన్ ను అనేక అంశాలను పరిశీలించిన తర్వాత దేవాదాయ శాఖ క్రిందికి తెచ్చారు. ముఖ్యంగా అర్చకుల లో ఎక్కువమంది ఈ సామాజిక వర్గానికి చెందిన వారని వారికి ఉపయోగపడే స్కీముల తయారీకి దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంటే మంచిదని. pic.twitter.com/1HlXNa2WFC
— IYRKRao , Retd IAS (@IYRKRao) September 24, 2021
ప్రజా వేదిక కూలగొట్టడం మొదలుకొని, నిన్న మొన్న టిటిడి జంబో బోర్డు, ఈ రోజు ఈ నిర్ణయం వరకు ఈ ప్రభుత్వానికి ఆలోచన లేకుండా ,చేయకుండా, నిర్ణయాలు తీసుకోవడం పరిపాటి అయింది.
— IYRKRao , Retd IAS (@IYRKRao) September 24, 2021
అయినా ఈ ఇద్దరినీ నమ్మడం కష్టమే. ఎందుకంటే భవిష్యత్తులో జగన్ కు ఉపయోగపడేందుకు ఇపుడు తమ క్రెడిబులిటీ కాపాడుకుంటున్నారేమో ఎవరికి తెలుసు?